AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amul Franchise: మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం.. అమూల్ ప్రాంచైజీ ఉందిగా..

AMUL Franchise Opportunity: మీరు నిరుద్యోగులా.. కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారా.. మీలాంటి వారి కోసం గొప్ప అవకాశం. ఉద్యో్గం కోసం చూస్తున్న వారు ఏకంగా వ్యాపార రంగంలో రాణించవచ్చు. ప్రారంభించిన.

Amul Franchise: మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం.. అమూల్ ప్రాంచైజీ ఉందిగా..
Amul Franchise
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2021 | 11:40 AM

Share

AMUL Franchise Opportunity: మీరు నిరుద్యోగులా.. కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారా.. మీలాంటి వారి కోసం గొప్ప అవకాశం. ఉద్యో్గం కోసం చూస్తున్న వారు ఏకంగా వ్యాపార రంగంలో రాణించవచ్చు. ప్రారంభించిన మొదటి రోజు నుంచే సంపాదించవచ్చు. ఎలాగనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.. పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ మంచి అవకాశాలను అందిస్తోంది. అముల్.. కొత్త సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. వీటిలో ప్రతీనెలా పెట్టుబడులు పెట్టవచ్చు. అముల్ ఫ్రాంచైజీ లాభదాయకం. అతితక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది.

2 లక్షలతోనే.. వ్యాపారం అముల్ సంస్థలో రాయల్టీ లేదా లాభం పంచుకునే ఫ్రాంచైజీని అందిస్తోంది. అయితే.. అముల్ ఫ్రాంచైజీని సంపాదించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. దీంతోపాటు ఇంటినుంచే సంపాదించుకోవచ్చని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభంలోనే మంచి లాభాలను గడించవచ్చని.. రూ.5 నుంచి 10 లక్షల వరకు పాల ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టవచ్చని పేర్కొంటున్నారు.

ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి? అమూల్ రెండు రకాల ఫ్రాంచైజీలను అందిస్తోంది. మొదటిది అమూల్ అవుట్లెట్, అమూల్ రైల్వే పార్లర్ లేదా అముల్ కియోస్క్ ఫ్రాంచైజ్, రెండవది అముల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజ్. మీరు మొదట పెట్టుబడి పెట్టాలనుకుంటే రూ.2 లక్షలు కావాలి. అలాగే మీరు మరొక ఫ్రాంచైజీని కొనాలని ఆలోచిస్తుంటే దానికోసం రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇందులో కంపెనీకి భద్రతగా.. 25 నుంచి 50 వేల రూపాయలు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.

కమిషన్ ఎంత ఉంటుందంటే..? అమూల్ అవుట్లెట్ కొనుగోలు చేసిన తరువాత.. కంపెనీ ఉత్పత్తుల కనీస అమ్మకపు ధర ఆధారంగా కమీషన్ చెల్లిస్తుంది. అంటే.. MRP ధర ప్రకారం.. పాల ప్యాకెట్లపై 2.5 శాతం, పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్‌క్రీమ్‌పై 20 శాతం కమిషన్ ఇస్తుంది. అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజీలో ఐస్ క్రీం, మిల్క్ షేక్స్, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, చాక్లెట్, జ్యూస్ లాంటి ఉత్పత్తులపై 50% కమీషన్ చెల్లిస్తుంది. ప్రీ-ప్యాకేజ్డ్ ఐస్ క్రీం మీద 20 శాతం, అముల్ ఉత్పత్తులపై 10 శాతం కమీషన్ కూడా కంపెనీ చెల్లిస్తుంది.

చాలా స్థలం అవసరం మీరు అముల్ ప్రాంచైజీ తీసుకోవాలనుకుంటే.. మీకు 150 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అముల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీ కోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలంటే..? మీరు ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే.. నేరుగా retail@amul.coop కు మెయిల్ చేయాలి. మీరు http://amul.com/m/amul-scooping-parlours వెబ్‌సైట్‌ని సందర్శించి కూడా సమాచారాన్ని పొందవచ్చు.

Also Read:

International Women’s Day 2021 : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అయితే భూమి మీద 2030 నాటికి మహిళల సంఖ్య భూమిపై సగం సగం

CERAWeek event: వాతావరణ మార్పులతో అలాగైతేనే పోరాడగలం.. ‘సెరా వీక్’ సదస్సులో ప్రధాని మోదీ