AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opinion poll 2022: పంజాబ్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించనున్న ఆప్.. గోవా, ఉత్తరాఖండ్‌ల్లో బీజేపీదే హవా!

త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న క్రమంలో పలు మీడియా ఛానళ్లు ఓపీనియన్ పోల్స్ వెలువరిస్తున్నాయి.

Opinion poll 2022: పంజాబ్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించనున్న ఆప్.. గోవా, ఉత్తరాఖండ్‌ల్లో బీజేపీదే హవా!
Elections
Balaraju Goud
|

Updated on: Jan 29, 2022 | 1:08 PM

Share

Assembly Elections Opinion Poll 2022:  త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న క్రమంలో పలు మీడియా ఛానళ్లు ఓపీనియన్ పోల్స్(Opinion Polls) వెలువరిస్తున్నాయి. తాజాగా, టైమ్స్ నౌ- వీటో సంయుక్తంగా ఓపీనియన్ పోల్స్ తన ఫలితాలను విడుదల చేసింది. అధికార బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ పంజాబ్‌(Punjab)లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం సాధిస్తుండగా, గోవా(Goa), ఉత్తరాఖండ్‌(Uttarakhand)లలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ- వీటో నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది.

పంజాబ్ ఆప్ పాగా… సర్వే నివేదిక ప్రకారం.. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 43 నుంచి 46 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో 0-3 సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. శిరోమణి అకాలీదళ్‌కు 10 నుంచి 13 సీట్లు వస్తాయని, ఆప్‌కి 57 నుంచి 60 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ పనితీరుపై 46.32 శాతం మంది సంతృప్తి చెందినట్లు సర్వేలో తేలింది.

గోవాలో కూడా ఆప్ హవా,  అయిన బీజేపీ గెలుపు.. అటు, గోవాలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కోస్తా రాష్ట్రంలో ఆప్‌కు మంచి ఫలితాలు వస్తాయని సర్వేలు సూచిస్తున్నాయి. 40 సీట్లలో బీజేపీకి 20-23 సీట్లు, కాంగ్రెస్‌కు 4 నుంచి 6 సీట్లు, ఆప్‌కి 6-10 సీట్లు, స్వతంత్ర అభ్యర్థులకు 5 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కాషాయ పార్టీకి 32.64 శాతం ఓట్లు వస్తాయని అంచనా. మరోవైపు కాంగ్రెస్‌కు 16.74 శాతం, ఆప్‌కి 24.85 శాతం, ఎంజీపీకి 7.74 శాతం, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్‌కు 2.12 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్‌లో సీఎం ధామి వైపే మొగ్గు.. అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వే ప్రకారం, ఉత్తరాఖండ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కొండ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సీఎం అభ్యర్థి. మొత్తం 70 సీట్లలో 42-46 సీట్లు బీజేపీ ఖాతాలో పడనున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ 12-14 సీట్లతోనూ, ఆప్ 8-11 సీట్లతోనూ సంతృప్తి చెందాల్సి రావచ్చు. స్వతంత్ర అభ్యర్థులు కూడా 2-5 స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఓట్ల శాతం 41.11 శాతంగా అంచనా. అదే సమయంలో కాంగ్రెస్‌లో 27.31 శాతం, ఆప్‌లో 18.67 శాతం, స్వతంత్ర అభ్యర్థులు 12.91 శాతం మంది మిగిలిపోవచ్చు.

ఉత్తరాఖండ్‌లో హరీష్ రావత్ పరిస్థితి ఏమిటి ? హరీష్‌ రావత్‌ను సీఎం అభ్యర్థిగా చేయకపోతే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని సర్వేలో పాల్గొన్న చాలామంది అభిప్రాయపడ్డారు. టైమ్స్ నౌ కథనం ప్రకారం, చార్ ధామ్ ఆలయ బోర్డును రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాబోయే ఎన్నికల్లో కుంకుమ పార్టీకి లాభిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సంజు వర్మ అన్నారు.

ఇదిలావుంటే, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగనున్నాయి. మూడు రాష్ట్రాల ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.

Read Also… Telangana MPs: పార్ల‌మెంట్ వ‌ద్దు.. అసెంబ్లీయే ముద్దు అంటున్న తెలంగాణ ఎంపీలు..!