AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Election 2022: మణిపూర్‌లో తుది విడత పోలింగ్ ప్రారంభం.. 22 స్థానాల్లో 92 అభ్యర్థుల పోటీ

Manipur 2nd Phase Voting: మణిపూర్‌లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.

Manipur Election 2022: మణిపూర్‌లో తుది విడత పోలింగ్ ప్రారంభం.. 22 స్థానాల్లో 92 అభ్యర్థుల పోటీ
Manipur
Shaik Madar Saheb
|

Updated on: Mar 05, 2022 | 8:09 AM

Share

Manipur 2nd Phase Voting: మణిపూర్‌లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 38 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తుది (Manipur Election 2022) విడతలో 22 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 22 సీట్లలో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,38,730 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ పాజిటివ్ లేదా క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చివరి గంటలో ఓటు వేయడానికి అనుమతించనున్నారు.

రెండో విడత ఎన్నికలు తౌబాల్, జిరిబం, చండేల్, ఉఖ్రూల్, సేనాపతి, టామెన్ గ్లాంగ్ జిల్లాల్లో కొనసాగుతోంది. 1247 పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసుల పహరా మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇంఫాల్ ఈస్ట్, చురాచంద్ పూర్ జిల్లాల్లోని 12 పోలింగ్ కేంద్రాల్లోనూ రీ పోలింగ్ సాగుతోంది. మొదటి విడత పోలింగ్ సమయంలో 12 కేంద్రాల్లో ఈవీఎంలను దుండగులు పగులగొట్టారు. దీంతో 12 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

కాగా.. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)ల మద్దతుతో 2017లో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఆరు రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి దానికి మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) అని పేరు పెట్టింది. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

Also Read:

R Priya: తమిళ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన డీఎంకే.. చెన్నై మేయర్‌‌ పీఠంపై తొలిసారి దళిత మహిళ..

Fuel Prices: పిడుగు లాంటి వార్త.. సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌పై రేట్లు!