Exit Poll Result 2022 Today: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి.. తేలేది ఆరోజే!

Exit Poll Result 2022 Date and Time: పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చి 10న వెలువడనున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Exit Poll Result 2022 Today: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి.. తేలేది ఆరోజే!
Exit Poll
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2022 | 11:47 AM

Exit Poll Result 2022 Date and Time: ఐదు రాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఎన్నికలు పూర్తికాగా.. మణిపూర్‌లో ఈ రోజు తుది దశ పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు చివరి దశ ఓటింగ్ (మార్చి 7న) సోమవారం జరగనుంది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనున్నాయి. అయితే.. పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ – ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చి 10న వెలువడనున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది పలు సంస్థలు, మీడియా వెల్లడించనున్నాయి. యూపీలో చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే.. ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల సంఘం విధించిన నిషేధం కూడా ముగియనుంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ మార్చి 7 సాయంత్రం 6 గంటల తర్వాత అందుబాటులో ఉండనున్నాయి. కాగా.. టీవీ 9 (TV9 Bharatvarsh) కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనుంది.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?

ఎన్నికల ఎగ్జిట్ పోల్‌ – (పోస్ట్-ఓట్ పోల్స్) ఓటర్లు తమ ఓటు వేసిన తర్వాత సర్వే నిర్వహిస్తారు. అసలు ఓటర్లు ఓటు వేయడానికి ముందు నిర్వహించే పోల్‌ను ఒపీనియన్ పోల్/ఎంట్రన్స్ పోల్ అంటారు. ఓటర్లు ఓటు వేసిన తర్వాత సేకరించిన సమాచారం ఆధారంగా తుది ఫలితాన్ని అంచనా వేయడం ఎగ్జిట్ పోల్స్ లక్ష్యం. వివిధ మీడియా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలను నిర్వహిస్తాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే ప్రక్రియ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడానికి చాలా మీడియా సంస్థలు పారదర్శక నమూనా పద్ధతిని అనుసరిస్తాయి. వయసు, జెండర్, కులం, మతం, ప్రాంతాలకు అనుగుణంగా సర్వే నిర్వహిస్తారు.

ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు..

ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 15,05,82,750. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,74,351.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం సీట్లు 403. వీటిలో 84 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ చేయబడ్డాయి. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) రిజర్వు అయ్యాయి.

యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

పంజాబ్: పంజాబ్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,88,764. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 24,689.

పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 34 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ అయ్యాయి.

ఇక్కడ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647.

ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి.

పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

గోవా: గోవాలో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 11,56,762. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,722.

గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కేవలం పెర్నెం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే షెడ్యూల్డ్ కులాల (SCలు) కోసం రిజర్వ్ చేశారు.

ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

మణిపూర్: మణిపూర్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 20,56,901. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2,959.

మణిపూర్‌లో 60 స్థానాలు ఉన్నాయి. వీటిలో 19 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) కోసం రిజర్వ్ అయ్యాయి. సెక్మాయి నియోజకవర్గం మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ అయింది.

ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Also Read:

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న పుతిన్ సైన్యం..

Manipur Election 2022: మణిపూర్‌లో తుది విడత పోలింగ్ ప్రారంభం.. 22 స్థానాల్లో 92 అభ్యర్థుల పోటీ