LIC IPO: మరింత ఆలస్యం కానున్న ఎల్‌ఐసీ ఐపీఓ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే కారణమా..?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(LIC)ఇన్షియల్ పబ్లిక్‌ ఆఫర్(IPO) ఆలస్యం కానుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు నష్టల్లో ఉండడంతో..

LIC IPO: మరింత ఆలస్యం కానున్న ఎల్‌ఐసీ ఐపీఓ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే కారణమా..?
Lic Ipo
Follow us

|

Updated on: Mar 05, 2022 | 12:36 PM

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(LIC)ఇన్షియల్ పబ్లిక్‌ ఆఫర్(IPO) ఆలస్యం కానుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు నష్టల్లో ఉండడంతో ఐపీఓ ఆలస్యం కానుంది. ఐపీఓ ఎప్పుడు తీసుకురావాలనే అంశంపై, ‘మదుపర్ల అత్యుత్తమ ప్రయోజనాల’ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. మార్కెట్ అస్థిరత తగ్గితే, ఏప్రిల్‌లో ఎల్‌ఐసీ ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. ఎల్‌ఐపీ ఐపీఓ ప్రతిపాదన అనంతరం కోటి కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరచుకున్నాయంటే, ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది.

ఇపుడు మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 8 కోట్లకు పైగా చేరింది. మార్కెట్‌కు కొత్త శక్తి వచ్చింద’ని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఇష్యూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా, అనుకోకుండా వచ్చిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల వల్ల మార్కెట్లలో తలెత్తిన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఎల్‌ఐసీ అనేది వ్యూహాత్మక పెట్టుబడి ఏమీ కాదు. అయితే అది చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. వృత్తిపరమైన సలహాదారులు ఈ ఐపీఓ విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారని వివరించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం ఎల్‌ఐసి పత్రాలను మరోసారి పరిశీలించాలన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఎల్‌ఐసీ IPO పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసీ ఐపీఓలో భాగంగా భారత ప్రభుత్వం తన 5% వాటాను విక్రయించనుంది. ఎల్‌ఐసీ ఐపీఓ ఇష్యూ ద్వారా రూ.60,000 కోట్లు సమీకరించనున్నారు. 2021-22 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమైన రూ.78,000 కోట్లను సాధించాలని కేంద్రం భావిస్తోంది. సంస్థకు, మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యంగా వివరించింది.

Read Also.. Stock Market: పెట్టుబడిదారుల 15 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మూడు వారాల్లో భారీ నష్టం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..