Lovely Virtual Guest: చిన్నారులతో కలిసి ఈస్టర్ లంచ్‌.. అక్కతో వీడియోకాల్.. కేరళ ప్రచారంలో రాహుల్ దూకుడు..

కేరళలో ఈస్టర్‌ పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. వయనాడ్‌లోని జీవన్‌జ్యోతి చిల్డ్రన్‌ హోమ్‌లో ఆయన చిన్నారులతో కలిసి లంచ్‌ చేశారు. కేరళ చేపల ఫ్రైతో..

Lovely Virtual Guest: చిన్నారులతో కలిసి ఈస్టర్ లంచ్‌.. అక్కతో వీడియోకాల్.. కేరళ ప్రచారంలో రాహుల్ దూకుడు..
Rahul Gandhi's
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 04, 2021 | 5:19 PM

Rahul Gandhi: కేరళలో ఈస్టర్‌ పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. వయనాడ్‌లోని జీవన్‌జ్యోతి చిల్డ్రన్‌ హోమ్‌లో ఆయన చిన్నారులతో కలిసి లంచ్‌ చేశారు. కేరళ చేపల ఫ్రైతో లాగించారు. అదే సమయంలో.. తన సోదరితో వీడియో కాల్‌ చేసి… చిన్నారులతో మాట్లాడించారు.

ఆదివారం వయనాడ్ జిల్లాలో ఓ అనాథాశ్రమంలో చిన్న పిల్లలతో కలిసి రాహుల్ భోజనం చేశారు.  ఈస్టర్ పండుగ సందర్భంగా అక్కడి అనాథ బాలలతో కలిసి విందు భోజనం చేశారు. ఓవైపు భోజనం చేస్తూనే తన సోదరి ప్రియాంక గాంధీకి వీడియో కాల్ చేశారు. అనాథ పిల్లలు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో వీడియో కాల్ లో మాట్లాడి మురిసిపోయారు.

ఏ స్పెషల్‌ ఈస్టర్‌ లంచ్‌ విత్‌ మై న్యూ ఫ్రెండ్స్‌ అంటూ… ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు తన సోదరి ప్రియాంక గాంధీతో చిన్నారులను వీడియో కాల్‌లో మాట్లాడించటం చాలా స్పెషల్‌గా మారింది. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. రాబర్ట్‌ వాద్రాకు కరోనా పాజిటివ్ రావడంతో.. ప్రియాంక సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రాహుల్ ఈ ఉదయం వయనాడ్ లోని తిరుణెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచార సంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రవేశం చేసి భక్తితో పూజలు చేశారు. అటు ఈస్టర్ సందర్భంగా స్థానిక సెబాస్టియన్ చర్చిలో ప్రార్థనలు కూడా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!