Exit Poll Result 2021 Kerala: నేటితో మినీ సంగ్రామానికి తెర.. వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్
Kerala Elections exit Poll Results 2021:దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు చివరి దశ పోలింగ్..

Kerala Elections exit Poll Results 2021:దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు చివరి దశ పోలింగ్ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో ఏయే పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.? ఏ పార్టీ విజయం సాధిస్తుంది.? ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి.? అక్కడి అధికారపక్షం మరోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా? లేదా విపక్షాలు విజయం సాధిస్తాయా.? అనేది ఇప్పుడు చర్చ. ఇదిలా ఈ ఐదు రాష్ట్రాలో ఎవరు అధికారం చేపడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, ఎన్‌డీఏ, ఇతరులు బరిలో ఉన్నాయి. ఇందులో ఎవరు గెలుస్తారనేదానిపై చర్చ కొనసాగుతోంది.
ఇక 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎల్‌డిఎఫ్ కూటమి.. కాంగ్రెస్ మద్దతు గల యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది. అయితే ఇక్కడ 73.58శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో 2.74 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగియడంతో వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీకి అధికారం దక్కనుందో.. ఒక అంచనాకు రావొచ్చు. ఐతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఏ పార్టీకి ఊపుందో తెలిసిపోతుందనే అంచనాతో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. అయితే టీవీ9 ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం .. కేరళలో నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో.. 140 స్థానాల్లో ఎల్‌డీఎఫ్‌కు 42.70 శాతం (70-80 సీట్లు), యూడీఎఫ్‌కు 40.10 శాతం (59-69 సీట్లు), ఎన్‌డీఏకు 15.40 శాతం (0-2 సీట్లు), ఇతరులు 1.80 శాతం.




