Karnataka Elections: కాంగ్రెస్ గెలిచేందుకు ఆ నినాదం బాగా పనిచేసింది.. సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లతో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే తమ పార్టీ 130 స్థానాల్లో గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లతో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే తమ పార్టీ 130 స్థానాల్లో గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని గద్దె దించేందుకు తమ పార్టీ ఇచ్చిన ’40 శాతం కమిషన్ ప్రభుత్వం’ అనే నినాదం బాగా పనిచేసిందని తెలిపారు. తాము ఎత్తి చూపిన ఈ సమస్యను ప్రజలు అంగీకరించి తమకు మెజార్టీ సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే కర్ణాటకలో ఏదైన పని జరగాలంటే ప్రభుత్వానికి 40 శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది.
ఇదిలా ఉండగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఆ రాష్ట్రంలోనే కాదు, దేశ ప్రజల్లోను ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లోనే కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాల్లో గెలిచింది.. ఎవరూ ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. మధ్యాహ్నం 1.00 PM వరకు కాంగ్రెస్ 131 స్థానాల్లో దూసుకెళ్తుండగా, బీజేపీ 65 స్థానాలకు పరిమితమైంది. మరోవైపు జేడీఎస్‌కు 22 స్థానాల్లో ముందుకెళ్తోంది. అయితే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏదైనా ఒక పార్టీ 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది.




#WATCH | #KarnatakaElectionResults | Congress leader Sachin Pilot says, “Congress has the majority. We will have a thumping victory. The slogan of “40% commission government” given by us, was accepted by the public. It was a major issue raised by us to defeat BJP. People accepted… pic.twitter.com/qg8gfkSSWD
— ANI (@ANI) May 13, 2023
మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..




