Karnataka Election: కర్ణాటక టు తమిళనాడు.. సీఎం స్టాలిన్‌తో కాంగ్రెస్ పెద్దల సంప్రదింపులు.. ఎందుకంటే..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. 132 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. 132 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. సిద్ధరామయ్య, డీకే శివ కుమార్.. ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎంగా ఎన్నిక కానున్నారు. అయితే, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులకు టచ్ లో ఉంటూనే.. అర్జెంటుగా బెంగళూరు రావాలంటూ పార్టీ అధిష్టానం సూచనలు చేసింది.
గెలిచిన ఎమ్మెల్యేలందరినీ శిబిరానికి తరలించే అవకాశం ఉంది. మొదట హైదరాబాద్ అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత క్యాంపు రాజకీయం తమిళనాడు వైపు మళ్లింది. గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించే అవకాశం ఉంది. తమిళనాడులోని హోటళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బసకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. 15 హెలికాప్టర్ల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




