Goa Elections 2022: హీటెక్కుతున్న గోవా రాజకీయాలు.. ఉత్పల్ పారికర్‌కు దక్కని బీజేపీ టికెట్..
Utpal Parrikar: గోవాలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల
Utpal Parrikar: గోవాలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ (BJP) 34 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సాంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. అయితే.. ఈ జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి, దివంగత మనోహర్ పారికర్ (manohar parrikar) కుమారుడు ఉత్పల్ పారీకర్ (Utpal Parrikar) కు నిరాశ ఎదురైంది. పణజి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ఉత్పల్‌కు బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది. పణజి నియోజకవర్గ టికెట్‌ను అటానాసియో మోన్సెరేట్‌కు బీజేపీ కేటాయించింది. అటానాసియో మోన్సెరేట్ పణజిలో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో పార్టీ అతనికి ఆ సీటును కేటాయించింది. అతను అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచారు.
కాగా.. ఉత్పల్ పారికర్ తన తండ్రి స్థానం నుంచి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ సీటును కేటాయించకపోవడంపై ఆయన పార్టీ ఆధిష్టానంపై కోపంతో ఉన్నారు. పనాజీలో ఉత్పల్ ఇండిపెడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ సీటుకు బదులుగా పర్రీకర్ కుటుంబానికి రెండు సీట్లు కేటాయిస్తామని పార్టీ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో తన నిర్ణయాన్ని తెలుపుతానని ఉత్పల్ తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉంటే.. కాగా పారికర్ కుటుంబాన్ని పార్టీ పట్టించుకోవడం లేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఉత్పల్‌కు తాము టికెట్ ఇస్తామని ప్రకటించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పారికర్ కుటుంబాన్ని గౌరవించడం లేదంటూ మండిపడ్డారు.
ఇదిఉంటే.. గోవాలో రెండో దశలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.
Also Read: