Goa Elections 2022: ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ సీఎం తనయుడు..
Goa Elections 2022: దివంగత నేత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 14న జరగనున్న..
Goa Elections 2022: దివంగత నేత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘రెండు దశాబ్దాలుగా తన తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన పనాజీ నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. అది కూడా.. కాంగ్రెస్‌ను వీడి జూలై 2019లో బీజేపీలో అటానాసియో మోన్సెరేట్‌కి. నాకు వేరే మార్గం లేకుండా పోయింది. నేను పార్టీకి రాజీనామా చేశాను. పనాజీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను.’’ అని ఉత్పల్ పారికర్ ప్రకటించారు.
రాజీనామా కష్టంగానే ఉన్నప్పటికీ.. గోవా ప్రజల కోసం ఇది తప్పడం లేదు అని ఉత్పల్ పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, గోవా ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ నాకు వేరే ఆప్షన్స్ ఇచ్చింది. కానీ, విలువల కోసం పోరాడే వాడిని. నా భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారు. ఇకపై బీజేపీతో ఎలాంటి చర్చలు ఉండవు.’’ అని ఉత్పల్ స్పష్టం చేశారు. కాగా, ఇతర పార్టీల మద్ధతు కోరుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తాను ఏ పార్టీలో చేరబోను, ఎవరి మద్ధతు తీసుకోను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను.’’ అని స్పష్టం చేశారు ఉత్పల్.
ఇదిలాఉంటే.. గురువారం నాడు బీజేపీ గోవా ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తమ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తూ, పార్టీ ఉత్పల్‌కు మరికొన్ని సీట్లను ఆఫర్ చేసిందని, అయితే ఆయన దేని నుండి పోటీ చేయడానికి ఇష్టపడలేదని చెప్పారు. అంతకుముందు రోజు, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత బీజేపీకి మద్ధతు ఇవ్వమని హామీ ఇస్తే పారికర్‌కు మద్ధతు ఇస్తామని చెప్పారు. మరోవైపు ఉత్పల్‌కు టికెట్ నిరాకరించడంపై బీజేపీ తీరుపై మండిపడ్డారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పారికర్ కుటుంబానికి ‘యూజ్ అండ్ త్రో’ గా మాత్రమే బీజేపీ భావిస్తోందని విమర్శించారు. ఉత్పల్‌ను తమ పార్టీలో ఆహ్వానించారు కేజ్రీవాల్.
Also read:
APSRTC Bus: ఏడేళ్ల తర్వాత ఆ రూట్లో మళ్లీ ఆర్టీసీ బస్సు.. ఇంతకీ గతంలో ఆపేశారంటే..