AP Night Curfew: ఏపీలో పక్కాగా అమలవుతున్న నైట్ కర్ఫ్యూ.. రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్న పోలీసులు..!
AP Night Curfew: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండేళ్లుగా వ్యాపిస్తున్న కోవిడ్.. సెకండ్‌వేవ్ తర్వాత తగ్గుముఖం పడుతుందనే..
AP Night Curfew: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండేళ్లుగా వ్యాపిస్తున్న కోవిడ్.. సెకండ్‌వేవ్ తర్వాత తగ్గుముఖం పడుతుందనే లోపే థర్డ్‌వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ లాంటి చర్యలు చేపడుతున్నాయి. ఇక ఏపీలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు రెట్టింపు అవుతుండడంతో నైట్ కర్ఫ్యూ మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు పోలీసులు. మెడికల్ ఎమర్జెన్సీలు మినహా ఎవరైనా రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనబడితే తాట తీస్తున్నారు పోలీసులు, రాత్రిపూట ఫుడ్ కోర్టులను సైతం 10 గంటల లోపు మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ కోర్ట్ అనగానే రాత్రుళ్ళు నిత్యం రద్దీగా ఉండే బెజవాడ రోడ్లె గుర్తుకొస్తాయి. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కారణంగా బెజవాడ లోని అన్ని ప్రధాన ఫుడ్ కోర్టులపై ఆంక్షలు పెట్టడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి కరోనా కట్టడి చేస్తున్నారు. పోలీసులు
బెజవాడలోని నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో ఫుడ్ కోర్ట్ ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. కరోనా భయంతో జనాలు కూడా బయటకు రావడం లేదని, రాత్రి సమయంలోనే ఎక్కువగా గిరాకీ ఉంటుందని, నైట్ కర్ఫ్యూ కారణంగా ముందుగానే మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. నైట్ కర్ప్యూ కారణంగా రోడ్లన్ని నిర్మానుషంగా మారుతున్నాయి. పోలీసులు సైతం పకడ్బందీగా వ్యవహరిస్తుండగా.. నైట్ కర్ఫ్యూ పక్కాగా అమలు అవుతోంది. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని, అలా వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా..
ఇక ప్రజలు ఎవరైనా మాస్క్ లేకుండా బయట తిరిగినట్లయితే పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. భారీగా జరిమానా వసూలు చేస్తున్నారు. ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు, పోలీసులు పదేపదే చెబుతున్నా.. కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన వస్తోందని పోలీసులు చెబుతున్నారు.
కాగా, నిన్న విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. 13,212 మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2153268కి చేరింది. కోవిడ్‌తో విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14532కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 64136 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవి కూడా చదవండి: