Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం..
Good News: ఏపీ ప్రజలకు, ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఇక నుంచి..
Uyyalawada Narasimha Reddy Airport: ఏపీ ప్రజలకు, ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఇక నుంచి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు వైజాగ్ చెన్నై బెంగళూరు మహా నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. ఇక నుంచి విజయవాడకూ విమానాలు నడవనున్నాయి. ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రయత్నం ఫలించి.. విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఇండిగో తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి నిన్నటి క్యాబినెట్ భేటీ ఆమోదం తెలపడంతో ఇది సాధ్యమైంది. మార్చి 27వ తేదీ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడవనున్నాయి. నల్లమల ఘాట్ లో రహదారి సరిగ్గా లేక కర్నూలు-విజయవాడ ప్రయాణికులకు నరకయాతన అనుభవిస్తున్నారు. విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే కర్నూల్ టు విజయవాడ గంటలోపే ప్రయాణం సాగించవచ్చు. తాజా ప్రకటనతో కర్నూలు జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి బుగ్గనకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు.
Also read:
Petrol Diesel Price: హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. తగ్గాయా.. పెరిగాయా..