AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC Bus: ఏడేళ్ల తర్వాత ఆ రూట్లో మళ్లీ ఆర్టీసీ బస్సు.. ఇంతకీ గతంలో ఆపేశారంటే..

APSRTC Bus - Visakha: విశాఖ ఏజెన్సీలో ఆ రూట్లో ఏడేళ్ల తర్వాత మళ్లీ బస్సు సర్వీసులు అందుబాటులో వచ్చింది.

APSRTC Bus: ఏడేళ్ల తర్వాత ఆ రూట్లో మళ్లీ ఆర్టీసీ బస్సు.. ఇంతకీ గతంలో ఆపేశారంటే..
Apsrtc
Shiva Prajapati
|

Updated on: Jan 22, 2022 | 7:54 AM

Share

APSRTC Bus – Visakha: విశాఖ ఏజెన్సీలో ఆ రూట్లో ఏడేళ్ల తర్వాత మళ్లీ బస్సు సర్వీసులు అందుబాటులో వచ్చింది. జీ. మాడుగుల మండలం మారుమూల గ్రామం గెమ్మెలి కి గత కొన్ని ఏళ్లుగా బస్సు సర్వీస్ నిలిచిపోయింది. మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో బస్సు సర్వీసును అధికారులు నిలిపివేశారు. ఆ తర్వాత కాలంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గినా బస్సు సర్వీసును పునరుద్ధరించాలని. దీంతో పాడేరు తోపాటు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన గిరిజనులు తీవ్ర అవస్థలు పడే వారు. సంతలో సరుకులు కొని ఎందుకు వెళ్లాలన్న.. అత్యవసర ప్రయాణం చేయాలన్నా.. బస్సు సర్వీస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తమ గ్రామాలకు బస్సు సర్వీసులు కల్పించండి అంటూ గత కొంతకాలంగా ఆయా గ్రామాల గిరిజనులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి సమస్య రావడంతో.. గిరిజనుల అభ్యర్థనతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చొరవ చూపారు. ఆర్టీసీ అధికారులను ఒప్పించి ఏళ్ల తర్వాత బస్సును మళ్ళీ పునరుద్ధరించారు. పాడేరు నుంచి జి.మాడుగుల మండలం గెమ్మెలి కి ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతేకాదు ఆర్టీసీ బస్సులో కూర్చుని గిరిజనులతో కొంత దూరం ప్రయాణించారు. గిరిజనులతో మాట్లాడారు. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఏజెన్సీలో రోడ్డు సదుపాయం ఉన్న గ్రామాలకు మరిన్ని బస్సులు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. తమ కష్టాలు తెలుసుకొని బస్సు సర్వీసును ప్రారంభించిన చేసిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు గిరిజనులు.

Also read:

Priyanka Chopra: తల్లైన స్టార్ హీరోయిన్.. సరోగసీ ద్వారా బిడ్డపుట్టినట్లు ప్రకటించిన ప్రియాంక నిక్ దంపతులు

Gopichand: మరోసారి విలనిజం చూపించబోతున్న గోపిచంద్.. మహేశ్‏ను ఢీకొట్టనున్న హీరో..

IPL 2022: లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఫిక్స్.. రిటైన్ లిస్టులో మరో ఇద్దరు ఎవరంటే?