NRIలు దేశ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఏం చేయాలి.. పూర్తి ప్రాసెస్ ఇదే..
దేశంలో ప్రజాస్వామ్య పండుగ ప్రారంభమైంది. తొలివిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగింది. ఈ ఎన్నికలు ఏడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగగా.. 25న రెండవ దశపోలింగ్ కు సర్వం సిద్దం చేస్తున్నారు అధికారులు. పోలింగ్‌లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు, ఇతర సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

దేశంలో ప్రజాస్వామ్య పండుగ ప్రారంభమైంది. తొలివిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగింది. ఈ ఎన్నికలు ఏడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగగా.. 25న రెండవ దశపోలింగ్ కు సర్వం సిద్దం చేస్తున్నారు అధికారులు. పోలింగ్‌లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు, ఇతర సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నారై ఓటర్లను కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేలా చైతన్యవంతులను చేస్తున్నారు. ఎన్నారై ఓటర్లు ఎవరు, విదేశాల్లో నివసిస్తున్నప్పుడు వారు ఎలా ఓటు వేయవచ్చో ఇప్పడు తెలుసుకుందాం.
ఎన్నికల సంఘం ప్రకారం ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు అంటే.. వేరే దేశ పౌరసత్వం తీసుకోకుండా ఉద్యోగం లేదా చదువుల నిమిత్తం అలాగే మరేదైనా కారణాల వల్ల ప్రస్తుతం భారతదేశంలో ఉండని భారతీయ పౌరులను ఎన్నారైలు అంటారు. అయితే వారి పేరు, అడ్రస్, తమ నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు మనదేశంలో నిర్వహించే అన్ని రకాల ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.
భారతీయుడు కాని వ్యక్తి కూడా ఓటు వేయవచ్చా?
భారతీయుడు కాని వారు ఎన్నికల్లో ఓటు వేయలేరు. అలాంటి వారు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు. వేరే దేశ పౌరసత్వం పొందడానికి భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిని కూడా భారత ఎన్నికల సంఘం ఈ దేశ ఓటరుగా జాబితాలో చేర్చదు.
విదేశాల్లో నివసిస్తున్న ఇండియన్స్ ఎన్నికల్లో ఎలా పాల్గొనవచ్చు?
ఎన్నారై ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ఫారం 6A నింపాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా భారత రాయబార కార్యాలయాల నుండి కూడా ఉచితంగా పొందవచ్చు. ఫారమ్ నింపిన తర్వాత, దానిని సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి. ఫారం 6Aతో పాటు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ ఫోటోకాపీ వంటి పత్రాలను కూడా పంపాలి. ఓటరు జాబితాలో పేరు కనిపించిన తర్వాత, ఎన్నారై ఓటు హక్కు పొందుతారు.
ఎన్నారై ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటు వేయవచ్చా?
ఓటు వేయడానికి, ఎన్నారై ఓటర్లు తమ పాస్‌పోర్ట్‌తో ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాలి. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం నివేదిక ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయలేరు. విదేశాల్లోని భారతీయ మిషన్లలో ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఆన్‌లైన్ ఓటింగ్ కోసం ఇంకా ఎలాంటి నిబంధన తీసుకురాలేదు. అలాగే భారతదేశంలో ఎన్నారై ఓటు వేయాలంటే.. అతను ఇండియాకు తిరిగి వచ్చినట్లు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి. అప్పుడు ఆ వ్యక్తిని సాధారణ ఓటరుగా ఓటర్ల జాబితాలో నమోదు చేస్తారు. అప్పడు ప్రత్యక్షంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు హక్కును తన సొంత నియోజకవర్గంలోనే వినియోగించుకోవచ్చు.
NRI ఓటర్లు ఓటర్ ID కార్డ్ (EPIC) పొందగలరా?
ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అప్లికేషన్‌ను దరఖాస్తు చేసుకున్న తర్వాత సాధారణ ఓటరుకు ఓటర్ ఐడీ జారీ చేయబడుతుంది. ఓటరు IDని ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) అని కూడా అంటారు. ఓటు వేసేందుకు అనుమతించడమే కాకుండా, ఈ కార్డు గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. అయితే ఎన్నారై ఓటర్లకు ఓటరు కార్డులు జారీ చేయదు ఎన్నికల కమిషన్. ఎన్నారై ఓటర్లు తమ పాస్‌పోర్టును పోలింగ్ స్టేషన్‌లో చూపించి ఓటు వేయవచ్చు.
మరిన్ని ఎన్నికల కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




