AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan: సీఎం జగన్ పై దాడి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్.. ఇంతకీ A2 ఎవరు..?

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో A2 ఎవరు...? ఎవరి ప్రోద్బలంతో సతీష్ దాడి చేశాడు. దుర్గారావు విచారణలో ఎం చెప్పాడు.. రాజకీయ కుట్ర కోణం ఉంది అంటున్న పోలీసులు వద్ద ఉన్న అధరాలు ఏంటి..? పోలిసుల విచారణలో ఉత్కంఠ కొనసాగుతోంది.

CM YS Jagan: సీఎం జగన్ పై దాడి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్..  ఇంతకీ A2 ఎవరు..?
Cm Jagan
Balaraju Goud
|

Updated on: Apr 21, 2024 | 8:37 PM

Share

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో A2 ఎవరు…? ఎవరి ప్రోద్బలంతో సతీష్ దాడి చేశాడు. దుర్గారావు విచారణలో ఎం చెప్పాడు.. రాజకీయ కుట్ర కోణం ఉంది అంటున్న పోలీసులు వద్ద ఉన్న అధరాలు ఏంటి..? పోలిసుల విచారణలో ఉత్కంఠ కొనసాగుతోంది.

ఏఫ్రిల్ 13వ తేదీ శనివారం సాయంత్రం విజయవాడ సింగ్ నగర్ గాంగనమ్మ గుడి వద్ద సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ను A-1 నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 14 రోజులు రిమాండ్లో విజయవాడ సబ్ జైల్లో ఉన్నాడు. సతీష్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. సీఎం జగన్‌ను అంతమొందించాలని ఉద్దేశంతో ఏ – 2 ప్రోత్బలంతోనే ఏ -1 సతీష్ పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయను తీసుకుని సున్నితమైన ప్రదేశంలో సీఎం జగన్‌పై దాడి చేశారని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన కీలకమైన వీడియో ఎవిడెన్స్ ఆడియో ఎవిడెన్స్ తో పాటు 12 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. A2 చెప్పిన ప్లాన్ ను A1 ఎగ్జిక్యూట్ చేశాడని పేర్కొన్నారు.

సతీష్ తో పాటు వడ్డెర కాలనీకి చెందిన పలువురుని ప్రశ్నించిన పోలీసులు ముఖ్యంగా సతీష్ వెంట ఉన్న ఐదుగురు మైనర్ యువకుల్ని ప్రశ్నించి వారిలో ఒక యువకుడి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఆ మైనర్ చెప్పిన వాంగ్మూలంలో సతీష్ సీఎం జగన్ పై మొదట సింగ్ నగర్ డాబా కోట్ల వద్ద ప్రయత్నించి విఫలం అయ్యాడు. తనను కూడా దాడి చేయమని ప్రోత్సహించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సీఎం జగన్ పై దాడి చేసి అంత మొందిస్తే దుర్గారావు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశజూపినట్లు, అయితే ఆ మైనర్ దాన్ని తిరస్కరించడంతో కొంచెం ముందుకెళ్లి గంగానమ్మా గుడి వద్ద సతీష్ సీఎంపై దాడి చేసినట్టు చెప్పాడు. దాంతో ఈ కేసు మొత్తం A2 దుర్గారావు అంటూ అతను వైపు మళ్ళింది. ఇక, అప్పటి వరకు పోలీసుల అదుపులో ఉన్న మైనర్లను వదిలేసిన పోలీసులు దుర్గారావు మాత్రం విడిచిపెట్టలేదు.

గత ఐదు రోజులుగా పోలీసు అదుపులోనే ఉన్న వేముల దుర్గారావు చుట్టూనే కేసు తిరిగింది. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న దుర్గారావును పోలీసులు వదిలిపెట్టకపోవటంతో టీడీపీ నేత బొండా ఉమపై పోలీసులు కేసు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక టీడీపి అధినేత చంద్రబాబు కూడా బొండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇలా రాజకీయంగా రసాభాసగా మారిన ఈ కేసు వ్యవహారంలో అనూహ్యంగా కొత్త టర్న్ తీసుకుంది.

అయితే శనివారం రాత్రి ఈ కేసుకు దుర్గారావుకు ఎలాంటి సంబంధం లేదంటూ అతన్ని ఇంటి దగ్గర వదిలేశారు పోలీసులు. ఈ కేసుపై విచారించడానికి తీసుకుని వెళ్ళామని తనకు ఎలాంటి సంబంధం లేదని మళ్ళీ విచారణ ఉంటే సహకరించాలని చెప్పి ఫామ్ 60 పై సంతకాలు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ కేసులో A2 ఎవరనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. దాడి కి కుట్ర పన్నింది ఎవరు, సతీష్ కు దాడి చేయ్యమని చెప్పింది ఎవరు, ఎవరి ప్రోద్బలంతో సతీష్ దాడి చేశాడు. సతీష్ ఒక్కడే దాడి చేశాడా దీని వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు పోలీసులకు మరింత సవాలుగా మారింది.

ఇప్పటి వరకు దుర్గారావు చుట్టూనే తిరిగిన కేసు కాస్తా అతన్ని వదిలేయటంతో ఇప్పుడు A2 ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌లో దుర్గారావు పేరు ఉన్న అతని ప్రమేయం ఉన్నట్లు ఏలాంటి అధారాలు లేకపోవటంతో ఇప్పుడి కేసు పోలీసులకు సవాలుగా మరింత సవాలుగా మారింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారించారు. దాడి జరిగిన స్పాట్ స్కూల్, గుడికి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతో పాటు సీఎం వెహికల్‌కు ఉన్న కెమెరాలు, సెల్ ఫోన్ లతో పాటు ఇతర కెమర్లో రికార్డ్ అయిన విడియో పుటేజ్ మొత్తాన్ని సేకరించారు పోలీసులు.

కొన్ని వందల సెల్ టవర్ డంప్ తో పాటు సాంకేతిక పరవైన ఆధారాలను ఇంకా సేకరిస్తునే ఉన్నారు. 8 టీమ్‌లు 40 మందికి పైగా పోలీసులు దాడి కేసులో అసలు రహస్యాన్ని వెలికితీసేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మారో పక్క న్యాయమూర్తి ముందు A1 సతీష్ 164 స్టేట్‌మెంట్ తీసుకునేందుకు పిటిషన్ వేశారు. రేపు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..