Health News: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆహార పద్ధతులు పాటిస్తే ఫలితం పక్కా..

ప్రస్తుత కాలంలో చాలా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. తమ శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా కొంత

Health News: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆహార పద్ధతులు పాటిస్తే ఫలితం పక్కా..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 2:04 PM

ప్రస్తుత కాలంలో చాలా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. తమ శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా కొంత మంది వివిధ రకాల డైట్‏లు ఫాలో అవుతూ అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే బరువు తగ్గే విషయంలో మాత్రం డాక్టర్ల సూచనలు ఫాలో కావాలి అంటారు నిపుణులు. అలాగే శరీరంలోని కొవ్వును తగ్గించడంలో మన వంటింట్లో కొన్ని పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఈ ఆహారా పదార్థాలు తీసుకోవడం ద్వారా క్రమంగా బరువు తగ్గడం జరుగుతుంది. మరీ అవెంటో తెలుసుకుందామా..

శరీరంలో పెరిగె అధిక కొవ్వును కరిగించడంలో కాఫీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. ఇక జీవక్రియలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో అవసరమయ్యే క్యాలరీల కోసం అధిక కొవ్వును కరిగిస్తుంది. అయితే కాఫీని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే గ్రీన్ టీ కూడా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చక్కటి ఔషదం అని చెప్పుకోవచ్చు. ఇందులో EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన కొవ్వును కరిగించడంలో చాలా ఉపయోగపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్, ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‏లో ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను కూడా ప్రచురించారు.

వీటితోపాటు ఎండు మిర్చిలో కూడా కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. వీటిలో ఉండే క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వలన ఎక్కువ కేలరీలు కోల్పోవడంతోపాటు కొవ్వు కూడా కరుగుతుంది. ఇక మనం ఎప్పుడూ తీసుకునే ఆహర పదార్థాలలో ఎండు కారం పొడిని వాడటం క్యాప్సైసిన్ శరీరానికి తగినంతగా అందుతుంది.

Also Read: Health News: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మెంతులు.. అధ్యయనంలో బయటపడ్డ విషయాలెంటీ ?…

Viral News: వామ్మో.. అతడి బరువు 435 కిలోలు.. రోజూకి 3 కిలోల మాంసం తినేస్తాడట.. “పాకిస్తాన్ హాల్క్” తెలుసా ?