Tollywood: ఈ టాలీవుడ్ నటుడిని గుర్తుపట్టారా.. ఇతని భార్య కూడా తెలుగులో ఓ స్టార్ నటి..
నవీన్ ఓలెటి.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, ప్రేమంటే ఇదేరా చిత్రంలో వెంకటేష్‌కు ఫ్రెండ్‌గా నటించింది ఆ నటుడే. తొలివలపు సినిమాలో హీరో అన్నయ్యగా నటించింది ఆయనే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన భార్య కూడా టాలీవుడ్ నటి...

పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడ్ని గుర్తుపట్టారా. బుల్లితెర , వెండితెరపై ఎన్నో సీరియల్స్.. సినిమాల్లో నటించి మెప్పించారు. దాదాపు 100 పైగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు వేశారు. అయ్యో చాలా సినిమాల్లో చూశాం కానీ అతని నేమ్ ఏంటో తెలియదు అనుకుంటున్నారా.. ఈ యాక్టర్ పేరు నవీన్ ఓలేటి. ఈ పేరు అంత పాపులర్ ఏం కాదు. అయితే ప్రేమంటే ఇదేరా చిత్రంలో వెంకటేష్ ఫ్రెండ్.. అంటే మాత్రం చాలామందికి బల్బ్ వెలుగుతుంది. తొలివలపులో హీరో సోదరుడిగా నటించిన ఈయన.. నువ్వే నువ్వే, ప్రేమించుకుందాం రా, విక్రమార్కుడు.. వంటి సినిమాల్లో మంచి రోల్స్ ప్లే చేశాడు.
నిజానికి నవీన్ సినిమాల్లో కంటే బుల్లితెరపై చాలా పాపులర్. పద్మవ్యూహం, నాన్న లాంటి సీరియల్స్‌లో నవీన్ పాత్రలు బాగా మెరిశాయి. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పలు సపోర్టింగ్ రోల్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరోలకు స్నేహితుడిగా చేసిన సినిమాలే ఎక్కువ. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే నవీన్ భార్య కూడా నటే. ఆమె పేరు మధురిమ. ఆమె కూడా బుల్లితెరపై, వెండితెరపై చాలా పాత్రల్లో మెరిశారు. ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ధళం సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
తొలివలపు, ప్రేమంటే ఇదేరా, ప్రేమతో రా, విక్రమార్కుడు, ఫ్యామిలీ సర్కస్, నరసింహనాయుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. మరి ముఖ్యంగా విక్రమార్కుడు మూవీతో మధురిమకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల భార్యగా ఆమె కనిపించింది. ఇక ఇదే సినిమాలో నవీన్ ఓలేటి కూడా పోలీస్ కానిస్టేబుల్ మంచి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీకి దూరమై USAలో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ కపుల్‌కు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు అబ్బాయి.

Madhurima Naveen