Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MANUU Admissions 2025: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్‌.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విధానంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

MANUU Admissions 2025: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్‌.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
MANUU Admissions 2025
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 15, 2025 | 7:44 AM

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విధానంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌తో పాటు దాని అనుబంధ క్యాపస్‌లు.. లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, అసన్‌సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్, బెంగళూరు, కటక్ కూడా ప్రవేశాలు చేపట్టనున్నారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా టెన్త్‌/ఇంటర్‌/ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో మీడియంగా లేదా ఉర్ధూ ఒక సబ్జెక్టుగానైనా చదివి ఉండాలి. లేదంటే ఉర్ధూతో తత్సమాన మదర్సా కోర్సులు ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడి అన్ని కోర్సులు (భాషా కోర్సులు మినహా) కేవలం ఉర్ధూ మీడియంలోనే ఉంటాయి. ఈ కోర్సులన్నింటిలో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్ రాయవల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగినవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే MANUU కోర్సులు ఇవే

పీహెచ్‌డీ కోర్సులు

ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్, ఎడ్యుకేషన్ తదితరాలు.

పీజీ కోర్సులు

ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌), ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం.

ఇవి కూడా చదవండి

యూజీ కోర్సులు

బీటెక్‌ (సీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌) లేటరల్‌ ఎంట్రీ, బీఈడీ, బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌).

ప్రొఫెషనల్‌ డిప్లొమా కోర్సులు

డీఈఎల్‌ఈడీ, పాలిటెక్నిక్- డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌- సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌- ఎలక్ట్రానికల్‌, అటోమొబైల్‌, అప్పారెల్‌ టెక్నాలజీ అండ్‌ పాలిటెక్నిక్- డిప్లొమా లేటరల్ ఎంట్రీ.

ఎలాంటి ప్రవేశ పరీక్షలేకుండా కేవలం మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు ఇవే

ఈ కోర్సుల్లో ప్రవేశాలకు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండానే కేవలం అకడమిక్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

  • పీజీ కోర్సులు: ఎంఏ(ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, అరబిక్‌, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ తదితరాలు), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ.జేఎంసీ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఒకేషనల్‌, పీజీడీటీఈ, ఎంసీఏ.
  • పీజీ డిప్లొమా కోర్సులు (పార్ట్ టైమ్): ఫంక్షనల్ ఉర్దూ, హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌, ప్రొఫెషనల్ అరబిక్, ట్రాన్స్‌లేషన్‌.
  • డిప్లొమా కోర్సులు (పార్ట్ టైమ్): ఉర్ధూ, తహసీన్-ఇ-గజల్, అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, ఇస్లామిక్ స్టడీస్ తదితరాలు.
  • సర్టిఫికేట్ కోర్సులు (పార్ట్ టైమ్): ఉర్దూ సర్టిఫికేట్ కోర్సు, ప్రొఫీసియన్సీ ఇన్‌ అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, తెలుగు, కశ్మీరీ, టర్కిష్.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ప్రవేశ పరీక్ష ఆధారిత కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: మే 13, 2025.
  • మెరిట్ ఆధారిత కోర్సుల్లో ప్రవేవాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జూన్‌ 4, 2025.
  • ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే: జూన్ 12, 13, 14 తేదీల్లో

MANUU అడ్మిషన్ 2025-26 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.