వేసవి లో చల్లగా బీర్ తాగుతున్నారా ? ఈ విషయాలు తెలిస్తే దిమ్మరుగుతుంది

Phani CH

14 April 2025

Credit: Instagram

డీహైడ్రేషన్ ప్రమాదం: బీర్‌లోని ఆల్కహాల్ శరీరంలో నీటిని త్వరగా బయటకు పంపుతుంది. ఫలితంగా, శరీరం నీరసించిపోతుంది, డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి.

కాలేయంపై ఒత్తిడి: ఎండాకాలంలో వేడి వల్ల శరీరం ఇప్పటికే ఒత్తిడిలో ఉంటుంది, ఇలాంటి సమయంలో బీర్ తాగడం కాలేయంపై అదనపు భారం పడి దెబ్బతినేలా చేస్తుంది.

బరువు పెరగడం: బీర్‌లోని అధిక కేలరీలు ఉండటం వల్ల  ఎండాకాలంలో కొవ్వుగా నిల్వ ఉండి ఊబకాయానికి దారితీస్తాయి.

గుండె సమస్యలు: ఎండాకాలంలో వేడి వల్ల గుండె రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో బీర్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ప్రమాదం పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి తగ్గడం: ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాలు సమర్థవంతంగా పనిచేయలేవు, దీనివల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, ఇతర వ్యాధులు సులభంగా సోకే అవకాశం ఉంది.

జీర్ణ సమస్యలు: బీర్ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది గుండెలో మంట, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.

వడదెబ్బ ప్రమాదం: బీర్ తాగడం వల్ల శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది, దీనివల్ల వడదెబ్బ సంభవించే అవకాశం పెరుగుతుంది.