Find a Lost Phone: మీ ఫోన్ పోగోట్టుకున్నారా ? అయితే ఇలా చేస్తే మీ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు..
మీ ఫోన్ పోగోట్టుకున్నారా ? అయితే సులువుగా మీ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల కోసం ప్రత్యేకించి టూల్స్ అందుబాటులో ఉన్నాయి.

మీ ఫోన్ పోగోట్టుకున్నారా ? అయితే సులువుగా మీ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల కోసం ప్రత్యేకించి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సహయంతో ఫోన్ ఎక్కడుందో సులవుగా తెలుసుకోవచ్చు. అయితే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఆండ్రాయిన్ ఫోన్ కనిపెట్టడం.. ఒకవేళ మీ ఫోన్ పోగోట్టుకున్నా.. లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన ఇప్పుడు సులభంగా ఈజీగా కనిపెట్టేయ్యోచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వార్ మీ ఫోన్ ట్రాక్ చేయ్యొచ్చు. ఇందుకోసం ముందుగా మీ గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వాలి. అయితే ఆ గూగుల్ అకౌంట్ ఫోన్లోను లాగి అయి ఉండాలి. ఆ తర్వాత Find My Device అనే సైటులోకి వెళ్ళి.. అక్కడ మీ జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అందులో కనపించే మెనులో పోయిన ఫోన్ ఏదో ఎంపిక చేసుకోవాలి. అనంతరం లోకేషన్ సెలక్ట్ చేయగానే ఒక మ్యాప్ కనిపిస్తుంది. అందులో మీ ఫోన్ లొకేషన్ మీకు దగ్గరగా ఉంటే వెంటనే play Sound అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అంతే మీ ఫోన్ సైలెంట్లో 5 నిమిషాల పాటు అలారం మోగుతూనే ఉంటుంది. అంతే మీ ఫోన్ ఎక్కడ ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది.
ఐఫోన్ కనిపెట్టడం.. ఇందుకోసం ఐఫోన్లలో ఒక స్పెషళ్ టూల్ ఉంది. అదే Find my iphone. మీ ఫోన్ లొకేషన్లో కనిపెట్టడంలో ఈ టూల్ పనిచేస్తుంది. ముందుగా icloud.comలోకి వెళ్ళండి. అక్కడ Find my iphone టూల్ యాక్సెస్ చేయాలి. ఇందులో మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడే All Devices అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే మెనులో మీరు పోగొట్టుకున్న ఫోన్ సెలక్ట్ చేయాలి. తర్వాత మీ స్క్రీన్ పై .. ఫోన్ లొకేషన్‌తో ఉన్న మ్యాప్ కనిపిస్తుంది.
ఫోన్ స్విచ్చాఫ్ అయితే ట్రాకింగ్ చేయడం.. ఇది ఐఫోన్ స్విచ్చాఫ్ అయినా ఈజీగా లొకేషన్ ట్రాక్ చేయ్యొచ్చు. ఫోన్ లొకేషన్ వాడినప్పుడు.. ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉన్నా కూడా అది ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళడానికి కంటే ముందుగా ఏ లొకేషన్లో ఉందో ట్రాక్ చేస్తుంది. ఈ మ్యాప్ ద్వారా ఆ లొకేషన్‌ను ట్రాక్ చేయ్యొచ్చు. ఆ తర్వాత మీ ఫోన్‌ను ఎవరైనా ఆఫ్ చేస్తే వెంటనే మీకు మెయిల్ వస్తుంది. అప్పుడు notify ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనితోపాటే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ట్రాక్ చేయ్యొచ్చు. ఈ ఫోన్లలో మాత్రం లొకేషన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి.. లేకపోతే లొకేషన్ వెతకడం కష్టమవుతుంది.
పోగోట్టుకున్న మొబైల్ లాక్ తీయడం.. మీరు పోగోట్టుకున్న ఫోన్లోని డేటాని సేవ్ చేసుకోవాలంటే లాక్ స్క్రీన్ చాలా అవసరం. ఐఫోన్లలో lost mode iphone, అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ నుంచి lock my phone సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది. ఇక మీ ఫోన్లో ఉన్న డేటాను ఎవరు యాక్సెస్ చేయలేరు.
ఆండ్రాయిడ్ ఫోన్ పోగోట్టుకుంటే find my device tool ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అలా చేస్తే వెంటనే మీ ఫోన్ లాక్ అయిపోతుంది. ఇదే కాకుండా మీ ఫోన్ పాస్ వర్డ్ లేదా పిన్ లేదా ప్యాటరన్ ఏది అయిన సెట్ చేయ్యొచ్చు. ☛ Find My Device లోకి వెళ్లండి. ☛ గూగుల్ అకౌంట్ ద్వారా Log in అవ్వాలి.. ఆ అకౌంట్ మీ ఫోన్‌కు అసోసియేట్ అయి ఉండాలి. ☛ ఒక ఫోన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. టాప్ స్ర్కీన్ పై మెనూ సెలక్ట్ చేయండి. ☛ Secure Device ఆప్షన్ పై క్లిక్ చేయండి. ☛ మీ ఫోన్ దొరికితే కనిపించేలా ఇక్కడ మెసేజ్ టైప్ చేయండి. ☛ Secure Device పై క్లిక్ చేయండి.
Also Read: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?… అయితే మీకు కావాల్సిన బైక్‌ను నచ్చిన ధరలో తీసుకోండి ఇలా..