New Chatting App: వాట్సాప్‌ ప్రైవసీ రూల్స్‌తో తెరపైకి కొత్త యాప్‌… ప్రపంచ కుబేరుడి రికమెండేషన్‌..

Signal App Downloads Increasing: గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వాట్సాప్‌ ప్రైవసీ కొత్త రూల్స్‌ వ్యవహారం తెగ హల్చల్‌ చేస్తోంది. వాట్సాప్‌ కొత్త ప్రైవెసీ...

New Chatting App: వాట్సాప్‌ ప్రైవసీ రూల్స్‌తో తెరపైకి కొత్త యాప్‌... ప్రపంచ కుబేరుడి రికమెండేషన్‌..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 6:13 AM

Signal App Downloads Increasing: గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వాట్సాప్‌ ప్రైవసీ కొత్త రూల్స్‌ వ్యవహారం తెగ హల్చల్‌ చేస్తోంది. వాట్సాప్‌ కొత్త ప్రైవెసీ నిబంధనలను తీసుకువస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ కొత్త ప్రైవేసీ రూల్స్‌కు వినియోగదారుడు అంగీకరించకపోతే యూజర్లకు వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తామని సందరు సంస్థ ప్రకటించడంతో వివాదం రేగింది. ఈ క్రమంలోనే వాట్సాప్‌ యూజర్‌ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని కూడా తెలిపింది దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వాట్సాప్‌పై విమర్శలకు దిగుతున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తూ మరో కొత్త యాప్ వైపు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారులను ఆకర్షిస్తోన్న ఆ కొత్త యాప్‌లో ‘సిగ్నల్‌’ మొదటి వరుసలో ఉంది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ అయిన సిగ్నల్‌ ఫౌండేషన్‌ రూపొందించిన ఈ ఎన్‌క్రిప్టెడ్‌ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ఇప్పుడు టెక్‌ దునియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దీంతో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నాయి. ‘సిగ్నల్‌’ డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో కొత్త అకౌంట్లకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్స్ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇక ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా ‘సిగ్నల్‌’ను ఉపయోగించండి అంటూ ట్వీట్‌ చేయడంతో ఈ యాప్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. మరి ఈ సంఘటనలతోనైనా వాట్సాప్‌ ప్రైవేసీ రూల్స్‌ విషయంలో వెనుకడుగు వేస్తుందో లేదో చూడాలి .

Also Read: What’s App New Privacy Terms: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలతో సమస్యలు ఉన్నాయా ?