What’s App New Privacy Terms: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలతో సమస్యలు ఉన్నాయా ?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ రూల్స్ గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ వాట్సాప్ ప్రైవసీ రూల్స్ అంటే ఏంటీ? ఇంతకీ వాటిని ఓకే చేస్తే కలిగే నష్టం ఎంటీ అని

What's App New Privacy Terms: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలతో సమస్యలు ఉన్నాయా ?
Follow us

|

Updated on: Jan 11, 2021 | 8:31 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ రూల్స్ గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ వాట్సాప్ ప్రైవసీ రూల్స్ అంటే ఏంటీ? ఇంతకీ వాటిని ఓకే చేస్తే కలిగే నష్టం ఎంటీ అని చాలా మందిలో మెదులుతున్న సందేహాలు.. అయితే టర్మ్ అండ్ కండీషన్స్ రూల్స్ అగ్రీ చేస్తే ఏమవుతుంది అనే విషయాలను తెలుసుకుందాం.

అయితే ముందుగా వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. వాట్సాప్‏లో మనం చేసే మేసేజ్‏లు కంపెనీ కావాలన్నా దొరకవు. ఎందుకంటే అవి ఎన్‏క్రిప్ట్ అయి ఉంటాయి. దాంతో ఆ మెసేజ్‏లు ఎవరకీ కనిపించవు. ఇక ఇందులో వాట్సాప్ సంస్థ తీసుకునే విషయాలు ఏంటంటే ఫోన్ నంబర్, ప్రొఫైల్‏లో కాంటాక్ట్ వివరాలు, ప్రొఫైల్ పేర్లు, పిక్చర్లు, డయాగ్నోస్టిక్ డేటా వివరాలు. ఇక వీటిపై ఇంతవరకు ఎలాంటి వివరణ వాట్సాప్ సంస్థ నుంచి లేదు. ఇక ప్రైవేట్ వాట్సాప్ సంబాషణలను కూడా ఫేస్‏బుక్ యాడ్స్ లాంటి వాటికోసం వాడుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక యూరోపియన్ యూజర్లకు వచ్చిన అప్‏డేట్‏లో వాట్సాప్ వారి డేటాను ఏం చేయలేదని తేలింది. వారి రీజియన్లో వాట్సాప్ తన డేటాను ఫేస్‏బుక్‏కు షేర్ చేయలేదు. ఇక వీటిని ప్రత్యేకంగా యాడ్స్ కోసం వాడడం కుదరదు. ఇదే విషయం యూరప్ వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరక్టెర్ మాట్లాడుతూ. వాట్సాప్ యూరోపియన్ రీజియన్లో యూజన్ ఇన్ఫర్మేషన్‏ను ఫేస్‏బుక్‏తో పంచుకొని ప్రొడక్ట్స్, యాడ్స్ ఇంప్రూవ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడలేదని తెలిపారు.

ఇక తాజాగా వాట్సాప్‏లో వచ్చి కొత్త ఫీచర్లు కూడా వీటికి యాడ్ కావడంతో వ్యాపారవేత్తలకు కమ్యూనికేట్ కావడానికి అనుమతి ఇచ్చినట్లుంటుంది. వ్యాపారాలు ఫేస్‏బుక్ హోస్ట్ చేయబడినవి కూడా. ఇదే కనుగ జరిగితే వినియోగదారులకు ముందుగా వారి వాట్సాప్‏కు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. వీటితోపాటు యూజర్లు తమ ఫేస్ బుక్ మేసేజెస్‏లను కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !

యూజర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చిన వాట్సాప్.. వచ్చే ఏడాది నుంచి వారి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదా?

Latest Articles