సింగిల్‌ చార్జింగ్‌తో 516 కిలో మీటర్లు.. అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కారు

01 May 2024

TV9 Telugu

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్ల హవా కొనసాగుతోంది. రకరకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి.

మార్కెట్లో

సింగిల్‌ చార్జింగ్‌తో వందలకొద్ది కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త మోడళ్లు విడుదల అవుతున్నాయి.

సింగిల్‌ ఛార్జింగ్‌

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ మార్కెట్‌కు ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐ5ని పరిచయం చేసింది. 

బీఎండబ్ల్యూ

ఎలక్ట్రిక్‌ 5 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్‌ ఇదే కావడం విశేషం. ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించింది.

ఎలక్ట్రిక్‌

సింగిల్‌ చార్జింగ్‌తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు.. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది.

సింగిల్‌ చార్జింగ్‌

అలాగే ఈ ఎలక్ట్రిక్‌ కారు గంటకు 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

గంటలకు 

205కిలోవాట్ల ఏసీ చార్జర్‌ కలిగిన ఈ కారు బ్యాటరీ కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జికానుంది.

205 కిలో వాట్లు

14.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల్లో కెమెరా, ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్‌ సీట్లతో రూపొందించింది.

టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే