Joe Biden: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌ను తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు… బహిరంగంగా వ్యాక్సినేషన్..
Joe Biden Receives Second Dose Vaccine: కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా ఒకటి. అగ్రరాజ్యంలో లక్షల సంఖ్య కేసులు నమోదుకాగా...

Joe Biden Receives Second Dose Vaccine: కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా ఒకటి. అగ్రరాజ్యంలో లక్షల సంఖ్య కేసులు నమోదుకాగా అదే సంఖ్యలో జనాలు మృత్యువాత పడ్డారు. ఇక ప్రస్తుతం మరోసారి కరోనా అమెరికాలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఫైజర్ వ్యాక్సిన్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ లభించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టడానికి అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఓసారి వ్యాక్సిన్ వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బైడెన్ వ్యాక్సిన్ రెండో డోస్‌ను తీసుకున్నారు. 78 ఏళ్ల వయసున్న బైడెన్ గత డిసెంబర్ 21న ఫైజర్ టీకా మొదటి డోస్ వేయించుకున్న విషయం తెలిసిందే. ప్రజల్లో టీకా పట్ల అవగాహన పెంచడానికే బహిరంగా వ్యాక్సినేషన్‌లో పాల్గొన్నట్లు బైడెన్ చెప్పారు. అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్ తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాలో ఇప్పటికే కొవిడ్19 కారణంగా 3 లక్షల 70 వేల మందికి పైగా చనిపోయారు.
Also Read: South Africa COVID-19 Vaccines: కరోనా వ్యాక్సిన్ రహస్య ప్రదేశంలో నిల్వ చేయనున్న దక్షిణాఫ్రికా