శృంగారాన్ని అర్ధం చేసుకోవడంలో పోర్నోగ్రఫీ ఉపయోగపడుతుంది.. యువత అభిప్రాయం… తాజా స్టడీలో సంచలన విషయాలు వెల్లడి..
Young Adults News: శృంగారాన్ని అర్ధం చేసుకోవడంలో పోర్నోగ్రఫీ ఉపయోగపడుతోందని యువత అభిప్రాయపడుతున్నట్లు ఓ స్టడీ పేర్కొంది...

Young Adults News: శృంగారాన్ని అర్ధం చేసుకోవడంలో పోర్నోగ్రఫీ ఉపయోగపడుతోందని యువత అభిప్రాయపడుతున్నట్లు ఓ స్టడీ పేర్కొంది. వినడానికి కొంచెం ఆశ్చర్యానికి గురి చేసినా.. ఇది నిజమండీ.. తాజాగా బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
‘శృంగారం చేసేటప్పుడు ఎలా ఉండాలన్నది పోర్నోగ్రఫీ ద్వారా తెలుసుకోవచ్చునని యువత అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆన్లైన్‌లో చాలావరకు ఉచితంగా లభ్యమయ్యే పోర్న్ వీడియోలు కేవలం వినోదం, క్రియేటర్స్‌కు డబ్బులు తెచ్చిపెట్టడం కోసం రూపొందించినవి’ అని స్టడీని లీడ్ చేసిన బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎమిలీ రోత్మన్ అన్నారు. ‘సెక్స్‌లో పాల్గొనేటప్పుడు మీరు ఎలా లైంగిక తృప్తిని పొందాలన్నదే ఆ వీడియోస్ సూచించవని’ ఆయన జోడించారు.
‘ఆర్కైవ్స్ ఆఫ్ సెక్యువల్ బిహేవియర్’ అనే జర్నాల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం కోసం పరిశోధకులు.. 357 మంది (18-24 సంవత్సరాల) యువకులు.. 324 మంది (14-17 సంవత్సరాల) కౌమర దశలో ఉన్నవారు తమకు లైంగికపరమైన విషయాల గురించి సమాచారం ఉందన్నారు. వీరిలో కౌమర దశలో ఉన్నవారు.. తల్లిదండ్రులు, స్నేహితుల ద్వారా సెక్స్ గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకున్నామని అన్నారు. 8 శాతం మంది మాత్రమే పోర్న్ వీడియోల ద్వారా తెలుసుకున్నామని స్పష్టం చేశారు.
అయితే కొంతమంది మాత్రం తల్లిదండ్రుల నుంచి తగినంత సమాచారాన్ని పొందలేదు. మీడియా, తమ సెక్యువల్ పార్టనర్స్ ద్వారానే పూర్తి ఇన్ఫర్మేషన్‌ను అందుకున్నారు. అటు అమ్మాయిల కంటే అబ్బాయిలే శృంగారాన్ని అర్ధం చేసుకోవడంలో పోర్నోగ్రఫీ ఉపయోగపడుతోందని భావిస్తున్నారు.
యువకులు, కౌమర దశలో ఉన్నవారు, ట్రాన్స్‌జెండర్ల సైతం తమ సెక్యువల్ పార్టనర్స్ కంటే పోర్నోగ్రఫీ నుంచి సెక్స్ గురించి తగినంత సమాచారాన్ని తెలుసుకోవచ్చునని అంటున్నారు. ప్రజారోగ్య దృక్పథం దృష్ట్యా రోత్మన్ మాట్లాడుతూ, యువతలో గణనీయమైన శాతం మంది శృంగారంలో ఎలా లైంగికంగా తృప్తి పొందాలనే దాన్ని పోర్న్ వీడియోలను సమాచార వనరుగా భావిస్తున్నారు. యువతకు సమగ్ర లైంగిక విద్య తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అని పరిశోధకుడు అంటున్నాడు.




