నర్సరావుపేట వైద్యశాలలో అనూష మృతదేహానికి పోస్టుమార్టం, ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

ఉన్మాది పైశాచికత్వానికి బలైపోయిన డిగ్రీ విద్యార్థిని అనూష మృతదేహానికి నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తయింది. ఆసుపత్రిలో అనూష కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..

నర్సరావుపేట వైద్యశాలలో అనూష మృతదేహానికి పోస్టుమార్టం, ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పరామర్శ
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 25, 2021 | 10:18 AM

ఉన్మాది పైశాచికత్వానికి బలైపోయిన డిగ్రీ విద్యార్థిని అనూష మృతదేహానికి నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తయింది. ఆసుపత్రిలో అనూష కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. అనూష హత్య అత్యంత బాధాకరం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. “బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించాను.. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. అనూష హత్యపై రాజకీయాలు చేయడం తగదు.” అంటూ శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.

ఇలాఉండగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. సీఎంఓ అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనూషను హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని, నేరాన్ని నిరూపించి కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన అనూష కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తరపున రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు జగన్. వీలైనంత త్వరగా సాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించాలన్నారు. కాగా, అనూష హత్యపై నరసరావుపేటలో విద్యార్థి సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగాయి. మృతదేహంతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, బంధువులు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు.

కాగా, గుంటూరుజిల్లా నరసరావుపేటలోని స్థానిక కృష్ణవేణి ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న అనూష నిన్న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనూషను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి. అనూషది ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామం కాగా, అనూషను పొట్టనబెట్టుకున్న విష్ణువర్ధన్ రెడ్డిది బొల్లాపల్లి మండలం పమిడిపాడు. గత కొంతకాలంగా నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి బాధితురాలు అనూషను ప్రేమపేరుతో వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అనూష మరొకరితో అనూష చనువుగా ఉంటుందన్న అనుమానంతో, పైకి మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళిన విష్ణువర్థన్ రెడ్డి.. అనూషను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మృతదేహాన్ని పాలపాడు సమీపంలోని కాలువలో పడేశాడు. హత్య అనంతరం నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏమైతే ఏమి, కర్మభూమిలో మరో పువ్వు రాలింది. ఓ ఉన్మాది చేతిలో చిదిగిపోయింది. ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ప్రేమున్న చోట అనుమానం ఉంటుందా… కానీ ఇంతలేడు కాని వాడి ఒంటి నిండా అనుమానపు బీజాలే. ఆ యువతి అతని సొంతమైనట్టు..ఆమెకు ఆమె జీవితం పట్ల ఎలాంటి రైట్స్‌ లేనట్లు…ఎవ్వరితోనైనా మాట్లాడుతూ పాపం ఆ యువతి కనిపిస్తే..ఇక అంతేనట. ఇలాంటోడు ప్రేమికుడవతాడా.., రాక్షసుడవతాడు కానీ..అందుకే పైకి ప్రేమ నటిస్తూ..లోపల ధ్వేషం పెంచుకుని..చివరికి కసిదీరా ఆ అమాయకురాలిని అంతం చేశాడు. Read also : ఒకప్పటి కరువు ప్రాంతాలు, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మారుమ్రోగుతున్నాయి,. ఏవి.. ఆ రెండు తెలుగు ప్రాంతాలు, ఏమా కథ.?

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!