Youth died in Street Fight: పాతబస్తీలో ముష్టిఘాతుకానికి యువకుడు బలి.. చంచల్‌గూడ స్ట్రీట్ ఫైట్‌లో గాయపడ్డ వ్యక్తి చికిత్సపొందుతూ మృతి
Hyderabad Crime News: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. డబీర్‌పురా పోలీసు స్టేషన్ పరధిలో ఆదివారం అర్థరాత్రి ఘర్షణలో గాయపడిన అద్నాన్ చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు.
Hyderabad Youth Died after Street Fight: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. డబీర్‌పురా పోలీసు స్టేషన్ పరధిలో ఆదివారం అర్థరాత్రి ఘర్షణలో గాయపడిన అద్నాన్ చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు.. చంచల్‌గూడా జైలు సమీపంలోని వీధుల్లో అర్ధరాత్రి కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఓ చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. దీంతో యువకులు ఒకరిపైఒకరు విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అజీబ్, ముజీబ్, కమ్రాన్‌తో పాటు మరికొంత మంది చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బల ధాటికి అద్నాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఈఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
స్ట్రీట్ ఫైట్‌లో తీవ్రంగా గాయపడి..చికిత్సా ఫలితం లేకుండా మృతి చెందిన యువకుడు..
Read Also…. విషాదం.. తల్లి మరణించిందని.. ముగ్గురు బిడ్డల ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న ఘటన..