తల్లికి చివరి కాల్ చేసి.. పురుగుల మందు తాగేశాడు..!

హయత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. జీడిమెట్లకు చెందిన సునీల్ కుమార్ రెడ్డి, శశికళతో పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సునీల్ ఓ ప్రైవేటు ఉద్యోగి. పెళ్లై చాలా ఏళ్లు అవుతోంది. అయినా సంతానం కలుగలేదు. పైగా భార్యతో తరచూ విభేదాలు జరుగుతున్నాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వాలని […]

  • Publish Date - 4:24 pm, Tue, 1 October 19 Edited By:
తల్లికి చివరి కాల్ చేసి.. పురుగుల మందు తాగేశాడు..!

హయత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. జీడిమెట్లకు చెందిన సునీల్ కుమార్ రెడ్డి, శశికళతో పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సునీల్ ఓ ప్రైవేటు ఉద్యోగి. పెళ్లై చాలా ఏళ్లు అవుతోంది. అయినా సంతానం కలుగలేదు. పైగా భార్యతో తరచూ విభేదాలు జరుగుతున్నాయి. దీంతో తనకు విడాకులు ఇవ్వాలని కొంతకాలంగా సునీల్ కుమార్ రెడ్డి శశికళను కోరుతున్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. మనస్తాపానికి గురైన అతడు చావే సరైన మార్గం అనుకున్నాడు. తన అన్న, తల్లికి వీడియో కాల్ చేసి నేను చనిపోతున్నానని చెప్పాడు. పురుగుల మందును కూల్ డ్రింక్‌లో కలుపుకుని.. వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇదే చివరి ఫోన్ కాల్ అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేసుకుని మృతుడి వద్ద దొరికిన ఆధారాలను బట్టి సునీల్ కుమార్ రెడ్డిగా అతడిని గుర్తించారు.