Vijayawada: విజయవాడలో పట్టపగలు దారుణ హత్య.. అంతర్‌రాష్ట్ర ముఠా పనేనంటూ అనుమానాలు..
Brutal Murder News: సత్యనారాయణపురం రైల్వే కాలనీలో పట్టపగలు దొంగలు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. చోరీకి వచ్చి, ఎదురు తిరిగిన మహిళ మెడకు టవల్ బిగించి చంపేశారు.. రైల్వే కాలనీలోని 75/బి క్వార్టర్లో నివసించే..
విజయవాడలో(Vijayawada ) దొంగలు బీభత్సం సృష్టించారు. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో పట్టపగలు దొంగలు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. చోరీకి వచ్చి, ఎదురు తిరిగిన మహిళ మెడకు టవల్ బిగించి చంపేశారు.. రైల్వే కాలనీలోని 75/బి క్వార్టర్లో నివసించే కె. సత్యనారాయణ రైల్వేలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో యథావిధిగా ఉద్యోగానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి వచ్చారు. భార్య సీత(50) ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికుల సహాయంతో వెనుక నుంచి లోపలికి వెళ్లి చూడగా.. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి ఉంది. వెంటనే లోపలికి వెళ్లిన వారు స్పృహ లేనిస్థితిలో పడి ఉన్న ఆమెను రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే .. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా ప్రదేశానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో చేరుకుని ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా గాలించారు. ఇంట్లో బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించారు. మరోవైపు ముగ్గురు యువకులు ఉదయం నుంచి ఆ ప్రాంతంలో తచ్చాడినట్లు సమీపంలో నివసించే రైల్వే సిబ్బంది చెబుతున్నారు.
సమాచారం అందుకున్న సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందాలతో ఇంటి పరిసరాల్లో గాలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని అంటున్నారు పోలీసులు. ముగ్గురు యువకులు ఉదయం నుంచి ఆ ప్రాంతంలో తచ్చాడినట్లు సమీపంలో నివసించే రైల్వే సిబ్బంది చెబుతున్నారు.