AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య దారి తప్పింది.. భర్త పలుమార్లు హెచ్చరించాడు.. ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్.. చివరకు

వివాహేతర సంబంధాలు కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. పరాయివాళ్ల మోహంలో పడి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు కొందరు.

భార్య దారి తప్పింది.. భర్త పలుమార్లు హెచ్చరించాడు.. ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్.. చివరకు
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2021 | 3:29 PM

Share

వివాహేతర సంబంధాలు కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. పరాయివాళ్ల మోహంలో పడి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు కొందరు. రోజూ ఇలాంటి ఘటనలు అనేకం నమోదవ్వడం ప్రమాదకర అంశంగా కనిపిస్తుంది. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అసహనంతో కలిసి ఏడడుగులు నడిచిన భర్తనే చంపేసింది ఓ మహిళ. అందుకు ప్రియుడి సహకారం తీసుకుంది.   కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మానుపాటి రాజయ్య(40) మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మడద గ్రామానికి చెందిన ఎనగందుల బాబు అక్కడే మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో అవసరాల కోసం వీరిద్దరూ అప్పుడప్పుడు డబ్బులు బదులు ఇచ్చిపుచ్చుకునేవారు. అలా ఏడాదిగా వీరి పరిచయం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రాజయ్య ఇంటికి వస్తూవెళ్తున్న క్రమంలో అతడి భార్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న రాజయ్య పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించారు. అలా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తనను ఇబ్బందిని పెడుతున్న రాజయ్యను చంపేయాలని వారిద్దరు డిసైడయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న విందు కోసమని బాబు తన సొంత ఆటోలో రాజయ్యను మడదకు తీసుకెళ్లి.. ఫుల్లుగా మద్యం తాగించాడు. అతను స్పృహ కోల్పోయాక అతడిని మానకొండూర్‌ మండలం ముంజంపల్లి కాకతీయ కెనాల్‌ వద్ద ఎవరూలేని ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడ రాజయ్య గొంతు నులిమి చంపేసిన కాలవలో పడేశాడు. అయితే తన భర్త కనిపించడం లేదని రాజయ్య భార్య ఐదో తేదీనే పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 19న మహబూబాబాద్‌ జిల్లా కొరివి పోలీస్‌ ఠాణా పరిధిలోని కాకతీయ కెనాల్‌లో కుళ్లిన స్థితిలో రాజయ్య డెడ్‌బాడీ దొరికింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  లోతైన విచారణ చేయగా భార్యే ప్రియుడితో కలిసి అతడిని చంపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.

Also Read: Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..