Telangana: అర్ధరాత్రి నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్.. భార్య సజీవదహనం.. భర్త, కొడుకు..

Medak District: తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని తిమ్మానగర్‌లో ఈ అగ్నిప్రమాదం

Telangana: అర్ధరాత్రి నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్.. భార్య సజీవదహనం.. భర్త, కొడుకు..
Fire Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2022 | 9:53 AM

Medak District: తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని తిమ్మానగర్‌లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నర్సింహులు కుటుంబం నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో పూరిగుడిసెకు మంటలు (fire accident) అంటుకున్నాయి. దీంతో ఇంట్లో నిద్రపోతున్న దంపతులు, కొడుకుకి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నర్సింహులు భార్య మంగమ్మ (35) సజీవ దహనమైంది. భర్త, కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని ఇద్దరిని రక్షించారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నర్సింహులు, కొడుకు రవికి చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 12 గంటలకు కరెంట్ ట్రిప్పు కావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: హాలీవుడ్‌ సినిమాను తలపించిన పక్షుల విన్యాసం.. రొమాంటిక్ సీన్ చూస్తే మైమరిచిపోవాల్సిందే..

Viral Video: ఇదేం పిచ్చి ఆనందం.. టాటూ క్రేజ్‌లో పడి యువతి చేసిన పనికి అంతా షాక్.. వీడియో