Viral Video: ఇదేం పిచ్చి ఆనందం.. టాటూ క్రేజ్‌లో పడి యువతి చేసిన పనికి అంతా షాక్.. వీడియో
Tattoo Viral Video: ప్రస్తుత కాలంలో టాటూ ఫ్యాషన్ ట్రెండ్‌లో కొనసాగుతోంది. చాలా మంది యువతీయువకుల్లో టాటూల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తమకిష్టమైన రకరకాల టాటూలను శరీరంపై వేయించుకుంటున్నారు.
Tattoo Viral Video: ప్రస్తుత కాలంలో టాటూ ఫ్యాషన్ ట్రెండ్‌లో కొనసాగుతోంది. చాలా మంది యువతీయువకుల్లో టాటూల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తమకిష్టమైన రకరకాల టాటూలను శరీరంపై వేయించుకుంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టాటూలకు ఎంతగానో బానిసలయ్యారు. తమకిఇష్టమైన డిజైన్, పేరు, గుర్తు లేదా ఫోటోను టాటూగా వేయించుకోవడానికి క్షణం కూడా ఆలస్యం చేయడంలేదు. అయితే.. ఇది కొంతమందికి వ్యామోహంగా మారుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే మనం చూసుంటాం.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి అందరూ షాక్ అవుతున్నరు. ఈ వీడియోలో ఓ మహిళ మోచేతి నుంచి చేతి వరకు ఇలాంటి వింత టాటూను వేయించుకుంది. ఇది చూసి అందరూ ఇదేం పిచ్చి అంటూ సోషల్ మీడియా (social media) యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తరచుగా కొన్ని వైరల్ వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ వీడియోలో ఓ యువతి మోచేతి నుంచి అర చేతి వరకు పచ్చబొట్టు వేయించుకుంది. ఈ టాటూ డిజైన్ చూస్తుంటే.. అచ్చం ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసినట్టు ఉంది.
View this post on Instagram
ఈ వీడియోలో యువతి చేయిపై నల్లటి పచ్చబొట్టు వేయడాన్ని మనం చూడవచ్చు. (యువతి ఫుల్ స్లీవ్ గ్లోవ్స్ లాగా మొత్తం చేతిని టాటూ వేసుకుంది). వీడియో చూస్తుంటే ఆ మహిళ చేతికి బ్లాక్ గ్లౌజులు తొడినట్టూ టాటూ కనిపిస్తోంది.
View this post on Instagram
ఈ టాటూ చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. టాటూ క్రేజ్ ఉండొచ్చు కానీ.. మరి ఇంతలా ఉండాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. మరికొంతమంది ట్రెండ్ అంటూ నవ్వుకుంటున్నారు.
Also Read: