AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భార్యకు కానిస్టేబుల్ టార్చర్.. కనుబొమ్మలు గీసి, జుట్టు కత్తిరించి..!

హవ్వ..! సభ్య సమాజం తలడించుకునే ఘటన ఇది. ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసే కఠినంగా వ్యవహరిస్తే..? కట్టుకున్న భార్యని టార్చర్ పెడితే..? అది కూడా మామూలు వేధింపులు కాదు..! ఏకంగా కనుబొమ్మలు గీసి, జుట్టు కత్తిరించి.. బతికి ఉండగానే నరకం చూపించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్.

Andhra Pradesh: భార్యకు కానిస్టేబుల్ టార్చర్.. కనుబొమ్మలు గీసి, జుట్టు కత్తిరించి..!
Police Constable
Maqdood Husain Khaja
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 23, 2024 | 9:10 PM

Share

హవ్వ..! సభ్య సమాజం తలడించుకునే ఘటన ఇది. ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసే కఠినంగా వ్యవహరిస్తే..? కట్టుకున్న భార్యని టార్చర్ పెడితే..? అది కూడా మామూలు వేధింపులు కాదు..! ఏకంగా కనుబొమ్మలు గీసి, జుట్టు కత్తిరించి.. బతికి ఉండగానే నరకం చూపించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్.

విశాఖలో పోలీస్ కానిస్టేబుల్ భార్యపై దాష్టికాన్ని ప్రదర్శించాడు. బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ, భార్యను వేధిస్తూ.. విచక్షణ కోల్పోయాడు. భయపెట్టి.. బెదిరించడమే కాకుండా.. భార్య కనుబొమ్మలు గీసి, జుత్తు కత్తిరించి టార్చర్ పెట్టాడు. వాడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో ఆ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులు తెలిపిన ప్రకారం.. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు భవాని శంకర్. రైల్వే న్యూ కాలనీలో ఉంటున్న మహాలక్ష్మితో 2013లో భవాని శంకర్ కు వివాహం అయింది. ఆ తర్వాత నుంచి వరకట్నం వేధింపులు అత్తింటి నుంచి మొదలయ్యాయి. మానసికంగా, శారిరకంగా వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెతో వాగ్వాదానికి దిగి మార్చి 17న పుట్టింటికి పంపించేశాడు. ఆ మరుసటి రోజే బాధితురాలిని పుట్టింటి వారు సర్ది చెప్పి అత్తింటికి పంపేశారు. అత్త ఆడపడుచు ఆమెను దూర్భాషలాడి మళ్ళీ పుట్టింటికి పంపేశారు.

అదే రోజు రాత్రి అత్తింటికి చేరుకున్న భవాని శంకర్.. భార్యపై కోపంతో దాడికి ప్రయత్నించాడు. అడ్డుకున్న మామపైనా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఓ గదిలోకి వెళ్లి భయంతో దాక్కుంది. మరింత కోపంతో ఉగిపోయిన భవానీ శంకర్, బయటకు రాకపోతే బామ్మర్ది కూతురుని పట్టుకుని చంపేస్తానని బెదిరించాడు. దింతో.. భయంతో గది నుంచి బయటకు వచ్చిన భార్యను హింసించాడు. జుత్తు కత్తిరించి, కనుబొమ్మలు గీసేశాడు.

పోలీసులను ఆశ్రయించిన బాదితురాలు

భర్త టార్చర్ భరించలేక భవాని శంకర్ తోపాటు అత్త, ఆడపడుచుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెసింది. తనకు పెట్టిన టార్చర్ ను వివరిస్తూ కంప్లైంట్ ఇచ్చింది. అదనపు కట్నం కోసం, అనుమానంతో వేధిస్తున్నట్టు అభియోగం మోపుతూ తనకు జరిగిన అవమానాన్ని లిఖితపూర్వకంగా పోలీసులకు వివరించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలను సేకరించి సెక్షన్ 498ఎ, 307, 508, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫోర్త్ టౌన్ పోలీసులు. కానిస్టేబుల్ భవాని శంకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ విజయ్ కుమార్ తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ సమాజంలో చెడును పారద్రోలాల్సిన పోలీసు.. ఇలా ఇంట్లో భార్య పట్ల కఠినంగా వ్యవహరించడంపై పెదవి విరుస్తున్నారు జనం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…