బంగ్లా సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ ఆపరేషన్.. గంజాయి, నిషేధిత డ్రగ్స్ స్వాధీనం..
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాలకు బీఎస్ఎఫ్ చెక్ పెడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పశువులను తరలిస్తుండగా.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పశువుల స్మగ్లర్లను..

వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాలకు బీఎస్ఎఫ్ చెక్ పెడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పశువులను తరలిస్తుండగా.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పశువుల స్మగ్లర్లను పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని పలు జిల్లాల బార్డర్ల వద్ద నుంచి అక్రమంలో పశువులను తరలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు పక్కా సమాచారం అందుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు మరింత పెంచారు. ఫెన్సింగ్ ఉన్న ప్రాంతాల్లో గస్తీ పెచడంతో.. ఈ పశువులను దొంగతనం చేస్తున్న ముఠాలకు పడుతోంది.
తాజాగా నదియా జిల్లాలోని సరిహద్లు ప్రాంతంలో 75.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. 50 ఫెన్సిడైల్ సిరప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదు పశువులను రక్షించారు. బీఎస్ఎఫ్ జవాన్లను గమనించిన స్మగ్లర్లు వాటిని అక్కడే వదిలేసి చీకట్లో పారిపోయారు. ఇంటలిజెన్స్ నుంచి స్మగ్లర్ల సంచాంరం ఉందని పక్కా సమాచారం అందడంతో.. సిబ్బంది ముందే అలర్ట్ అయ్యారు. దీంతో రాత్రి 8.00 గంటల సమయంలో వారు 141 బెటాలియన్ పరిధిలోని బార్డర్ అవుట్ పోస్టులైన జలంగీ, నర్సారీపార ప్రాంతం నుంచి పారిపోయారు. అక్కడ సిబ్బంది కూంబింగ్ చేపట్టాగా.. గంజాయి, డ్రగ్స్, పశువులు కనిపించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.