AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్నప్పటికీ.. స్మగ్లర్లు వారి దందాలను యథేచ్చగా సాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రగ్స్‌..

ఢిల్లీలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2020 | 5:05 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్నప్పటికీ.. స్మగ్లర్లు వారి దందాలను యథేచ్చగా సాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రగ్స్‌ ముఠాలను ఢిల్లీ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో డ్రగ్ ముఠాకు చెక్ పెట్టారు. ఓ కొరియర్ టర్మినల్‌లో దాడి చేసిన కస్టమ్స్‌ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. 650 గ్రాముల గ్రీనిష్-బ్రౌన్ షుగర్‌తో పాటు.. గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. పొడి గంజాయితో పాటు.. ద్రవ రూపంలో కూడా గంజాయిని గుర్తించామని.. అంతేకాకుండా ఇతర డ్రగ్‌ పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులు పేర్కొన్నారు.