Crime News: వరంగల్‌లో కలకలం.. అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్త అరెస్ట్..
Warangal corporator husband arrested: వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్‌కు చెందిన ఓ కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో కార్పొరేటర్
Warangal corporator husband arrested: వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్‌కు చెందిన ఓ కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్తను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్ భర్త శిరీష్ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై సెప్టెంబర్ 23వ తేదీన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేసినట్లు మీల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.
అప్పటినుంచి శిరీష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శిరీష్‌ను గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని పరకాల జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.
Also Read: