Bike Stunts: బైక్‌ రేసర్ల ఓవర్ యాక్షన్.. విజయవాడ పోలీసుల రియాక్షన్.. తాట తీస్తామన్న సీపీ శ్రీనివాసులు

బైక్ స్టంట్స్‌పై సీపీ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్‌లపై యువకులు ఫీట్లు చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.

Bike Stunts: బైక్‌ రేసర్ల ఓవర్ యాక్షన్.. విజయవాడ పోలీసుల రియాక్షన్.. తాట తీస్తామన్న సీపీ శ్రీనివాసులు
Bike Stunt Vijaya Durga
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 29, 2021 | 7:04 AM

విజయవాడలో బైక్‌ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ బైక్ స్టంట్స్‌పై సీపీ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్‌లపై యువకులు ఫీట్లు చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో లైక్లు కోసం బైక్లపై విన్యాసాలు చేయొద్దన్నారు. బైకులు సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.

ఇలాంటివి జరిగే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. విజయవాడలో ఇలాంటి రేసులు, విన్యాసాలు చేసే ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచుతున్నామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలకు సంబంధించి గతంలోనే చర్యలు తీసుకున్నమని వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు.. వారి తల్లిదండ్రులను కూడా పిలిచి హెచ్చరించి పంపించామన్నారు.

ఏం జరిగిందంటే..

విజయవాడ నగరంలో బైక్‌ రేసర్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తూ వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. స్టంట్లు చేస్తూ భయపెడుతున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితమైన బైక్‌ రేసింగ్‌లు…ఇప్పుడు నగరంలోని ప్రధానరహదారులపై నిర్వహిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.  వీరి వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Zojila Tunnel: వచ్చే ఏడాది నాటికి జోజిలా టన్నెల్ పనులు పూర్తి: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

YouTube: యూట్యూబ్‌లో ఆత్మహత్య వీడియోను తల్లికి చూపించిన మైనర్ బాలిక.. తెల్లవారేసరికి షాక్..!

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్