YouTube: యూట్యూబ్‌లో ఆత్మహత్య వీడియోను తల్లికి చూపించిన మైనర్ బాలిక.. తెల్లవారేసరికి షాక్..!

జీవితంలో ఎన్నో సాధించాల్సిన ఓ చిన్నారి.. తన కలలను కల్లలు చేసుకుంది. చిరుప్రాయంలోనే సోషల్ మీడియా వీడియోతో ప్రాణాలను తీసుకుంది. ఏకంగా తన తల్లికి ముందే చూపించి మరీ, బలవన్మరణానికి పాల్పడింది.

YouTube: యూట్యూబ్‌లో ఆత్మహత్య వీడియోను తల్లికి చూపించిన మైనర్ బాలిక.. తెల్లవారేసరికి షాక్..!
You Tube

Minor Girl Lost Life: జీవితంలో ఎన్నో సాధించాల్సిన ఓ చిన్నారి.. తన కలలను కల్లలు చేసుకుంది. చిరుప్రాయంలోనే సోషల్ మీడియా వీడియోతో ప్రాణాలను తీసుకుంది. ఏకంగా తన తల్లికి ముందే చూపించి మరీ, బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో మోక్షిత ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ స్టేషన్ ప్రక్కవీధిలో 13 యేళ్ల వయసు కలిగిన మోక్షిత గొంతు కోసుకొని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక (13) తన అమ్మమ్మ ఇంటి వద్ద బాత్ రూమ్‌లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కాగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్ లో వీడియోలు చూసిన మోక్షిత గొంతు కోసుకున్నట్లు అంబాజీపేట పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు మృతురాలి తల్లి ఇచ్చని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే, నిన్న సోమవారం ఉదయం తల్లికి యూట్యూబ్‌లో సూసైడ్ వీడియోస్ చూపించిన మోక్షిత.. తెల్లవారే సరికి విగతజీవిగా పడి ఉండటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బేబీ వెంకట సత్యవతి భర్త మరణించడంతో గత నాలుగు నెలలగా పుట్టిలైన అంబాజీపేటలో తన కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. అయితే, కుటుంబం కలహాలతోనే మైనర్ బాలిక సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఇటీవల కాలంలో యూట్యూబ్‌ వీడియోలు చూసి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గుంతకల్లు కేంద్రంగా దొంగ నోట్లు తయారు చేసి అక్రమంగా చలా మణి చేసిన ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నాు, ఈ నెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లిన అతను.. చికెన్‌ పకోడి కొనుగోలు చేసి రూ.వంద నోటు ఇచ్చాడు. దీన్ని నకిలీగా గుర్తుపట్టిన వ్యాపారి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు భాగోతం బయటపడింది.

మరో ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. యూట్యూబ్ వీడియో చూస్తూ ఇంట్లోనే ‍స్వయంగా అబార్షన్ చేయడానికి యత్నించిన ఓ యువతికి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలైంది. మ‌హారాష్ట్ర నాగ‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కాకుండానే గ‌ర్భం దాల్చిన యువతి.. అబార్షన్ ఎలా చేస్తారో, లేదా గ‌ర్భస్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆమె సొంతంగా అబార్షన్‌కు య‌త్నించింది. దీంతో ఆమెకు తీవ్ర ర‌క్తస్రావం కావ‌డంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త‌ర‌లించారు. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also…  కడుపులో కవలలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వెంటాడిన విషాదం.. ఆ కుటుంబంలో తీవ్ర దు:ఖం

PM Narendra Modi: బీజేపీ మరో ఘనత.. ప్రతి కార్యకర్తకూ గర్వకారణమంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu