AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deadbody in Musi: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్ల ఎత్తివేత.. మూసీకి భారీ వరద.. కొట్టుకొచ్చిన మృతదేహం..

హైదరాబాద్ ముసారంబాగ్ వద్ద మూసీనదిలో మృతదేహం కొట్టుకువచ్చింది. నదిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు వీడియో తీశారు...

Deadbody in Musi: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్ల ఎత్తివేత.. మూసీకి భారీ వరద.. కొట్టుకొచ్చిన మృతదేహం..
Musifinal
Srinivas Chekkilla
|

Updated on: Sep 28, 2021 | 5:28 PM

Share

హైదరాబాద్ ముసారంబాగ్ వద్ద మూసీనదిలో మృతదేహం కొట్టుకువచ్చింది. నదిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు వీడియో తీశారు.  సోషల్ మీడియోలో పోస్టు చేశారు. గులాబ్​ తుపాను ప్రభావంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహ పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన పడింది. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.

హైదరాబాద్‌ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్ల ఎత్తివేతడంతో మూసీకి వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. ఫలితంగా మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. చాదర్‌ఘాట్‌ వద్ద వంతెనను ఆనుకుని మూసీ వరద ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపేశారు. కోఠి-చాదర్‌ఘాట్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా వరద వస్తుండడం వల్ల చాదర్‌ఘాట్ వంతెనపై పోలీసుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీచేశారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పీర్జాదిగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. జియాగూడ వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం మంగళవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు విదర్భ పరిసర ప్రాంతాల్లో…. నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Read Also.. Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!