భార్యను చంపి.. తలతో పోలీసుస్టేషన్ లో లొంగిపోయిన భర్త

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనుమాష ఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్కోటకుడైన ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తల నరికి చంపాడు. దాన్ని చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు.

  • Balaraju Goud
  • Publish Date - 4:18 pm, Sat, 10 October 20
భార్యను చంపి.. తలతో పోలీసుస్టేషన్ లో లొంగిపోయిన భర్త

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనుమాష ఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్కోటకుడైన ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తల నరికి చంపాడు. దాన్ని చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బండా జిల్లాలో జరిగింది. బండా జిల్లా బాబేరు పట్టణానికి చెందిన కిన్నార్ యాదవ్, విమల దంపతులకు భగత్, ప్రహ్లాద్ అనే ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. అయితే, కిన్నార్ యాదవ్ మార్నింగ్ వాకింగ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో అతని భార్య విమల (35) పొరుగింటి వ్యక్తి రవికాంత్ తో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. అనుమానంతో రవికాంత్ తోపాటు భార్య విమలపై కిన్నార్ యాదవ్ గొడ్డలితో దాడి చేశాడు. భార్యను అతి కిరాతకంగా చంపి తల మొండం వేరు చేశాడు. అనంతరం ఆమె తలను చేత్తో పట్టుకుని రెండు కిలోమీటర్ల దూరంలోని పోలీసుస్టేషనుకు కాలినడకన వెళ్లి లొంగిపోయాడు.

భార్య తలతో యాదవ్ రోడ్డుపై నడచి వెళ్లిన యాదవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాదవ్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర పి చౌహాన్ చెప్పారు. తన భార్య విమలకు ఎలక్ట్రీషియన్ రవికాంత్ తో సంబంధం ఉందని అనుమానించానని, ఆమె తరచూ అతనితో మాట్లాడటం చూశానని యాదవ్ పోలీసులకు చెప్పాడు.