దొంగను ఛేజ్ చేస్తూ తల్లీకూతుళ్లు మృతి
ఇదొక దురదృష్టకర సంఘటన.. తమ బ్యాగ్‌లు ఎత్తుకుపోతున్న దొంగను పట్టుకోవాలని పరిగెత్తిన తల్లి,కూతుళ్లు ఇద్దరూ రైలుకింద పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన మధురలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మీనాదేవీ(45),మనీషా(21) ఇద్దరూ తల్లీ కూతుళ్లు. వీరిద్దరూ హజ్రత్ నిజాముద్దీన్ రైలులో ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు వెళ్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వ్రిందావన్ స్టేషన్ సమీపంలో ఎవరో ట్రైన్ ఎమర్జెన్సీ చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. దీంతో నిద్రపోతున్న వీరు ఉలిక్కిపడి లేచి చూస్తే […]
ఇదొక దురదృష్టకర సంఘటన.. తమ బ్యాగ్‌లు ఎత్తుకుపోతున్న దొంగను పట్టుకోవాలని పరిగెత్తిన తల్లి,కూతుళ్లు ఇద్దరూ రైలుకింద పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన మధురలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మీనాదేవీ(45),మనీషా(21) ఇద్దరూ తల్లీ కూతుళ్లు. వీరిద్దరూ హజ్రత్ నిజాముద్దీన్ రైలులో ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు వెళ్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వ్రిందావన్ స్టేషన్ సమీపంలో ఎవరో ట్రైన్ ఎమర్జెన్సీ చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. దీంతో నిద్రపోతున్న వీరు ఉలిక్కిపడి లేచి చూస్తే వీరి బ్యాగులు ఎత్తుకుపోతున్న వ్యక్తి కనిపించాడు. వెంటనే మీనాదేవీ, మనీషా ఇద్దరూ దొంగను వెంబడించారు. అయితే అతడ్ని పట్టుకునే ప్రయత్నంలో పట్టుతప్పి రైలుకింద పడిపోయారు.
ఈ ప్రమాదంలో మీనాదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె మనీషా మాత్రం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటన స్ధానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.