ఉన్నావ్ బాధితురాలికి న్యుమోనియా.. పరిస్థితి విషమం
అత్యంత దారుణంగా కారు ప్రమాదానికి గురైన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె న్యుమోనియాతో బాధపడుతున్నట్టు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమెతో పాటు ప్రమాదంలో తీవ్రగాయలపాలైన ఆమె లాయర్‌కు వెంటిలేటర్ తొలిగించినట్టు వైద్యులు చెప్పారు. అయిన్పటికీ ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్టు కాదన్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను […]
అత్యంత దారుణంగా కారు ప్రమాదానికి గురైన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె న్యుమోనియాతో బాధపడుతున్నట్టు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆమెతో పాటు ప్రమాదంలో తీవ్రగాయలపాలైన ఆమె లాయర్‌కు వెంటిలేటర్ తొలిగించినట్టు వైద్యులు చెప్పారు. అయిన్పటికీ ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్టు కాదన్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ కేసుపై బాధితురాలి చిన్నాన్న సుప్రీం కోర్టుకు రాసిన లేఖ ను పరిశీలించిన కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది.