చెన్నై ఎయిర్ పోర్టులో “మలేషియన్ డైమండ్స్”.. వ్యక్తి అరెస్ట్

చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డైమండ్స్‌ను పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. మలేషియా నుంచి పెద్ద మొత్తంలో డైమండ్స్‌ తీసుకుని వస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికులను నిశితంగా పరిశీలించారు డీఆర్ఐ అధికారులు. మలేషియాకు చెందిన […]

చెన్నై ఎయిర్ పోర్టులో మలేషియన్ డైమండ్స్.. వ్యక్తి అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 04, 2019 | 10:09 AM

చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డైమండ్స్‌ను పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. మలేషియా నుంచి పెద్ద మొత్తంలో డైమండ్స్‌ తీసుకుని వస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికులను నిశితంగా పరిశీలించారు డీఆర్ఐ అధికారులు.

మలేషియాకు చెందిన అజ్మల్ ఖాన్ మీరా అనూమానస్పద వస్తువులను పట్టుకుని వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అనుమానంతో బాడీ స్కాన్ చేయగా వజ్రాల గుట్టురట్టైంది. అజ్మల్ లోదుస్తుల్లో ఓ సంచిని అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా అతడు వెంట తీసుకొచ్చిన ప్రెషర్ కుక్కర్‌లోనూ డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అజ్మల్ వద్ద నుంచి 55 డైమండ్స్ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని డైమండ్స్ ఎవరి కోసం తీసుకొచ్చాడనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.