AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమజంట ఆత్మహత్య ఘటనలో భయంకర నిజాలు

పోలీసులు న్ని రకాల దర్యాప్తులు చేసిన తర్వాతే ప్రేమ ఫలించదేమోనన్న బెంగతో సుఖీయా, బంటి ఆత్మహత్య చేసుకున్నారని డిక్లేర్‌ చేశారు.

ప్రేమజంట ఆత్మహత్య ఘటనలో భయంకర నిజాలు
Balu
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:39 PM

Share

పది రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌ జిల్లాలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు న్ని రకాల దర్యాప్తులు చేసిన తర్వాతే ప్రేమ ఫలించదేమోనన్న బెంగతో సుఖీయా, బంటి ఆత్మహత్య చేసుకున్నారని డిక్లేర్‌ చేశారు.. ఈ సంఘటన జరిగిన ఆరు రోజులకు అదే చెట్టుకు కుల్దీప్‌ అనే యువకుడి శవం వేలాడుతూ కనిపించింది.. ఇతడెందుకు ఉరివేసుకున్నాడా అన్న అనుమానం పోలీసులకు వచ్చింది.. వెంటనే ప్రేమ జంట ఆత్మహత్య కేసును తిరగదోడారు..మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు.. ఈసారి చాలా సీరియస్‌గా చేసిన దర్యాప్తులో కుల్దీప్‌ది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది.. అంతేనా ఆ ప్రేమ జంటది కూడా బలవన్మరణం కాదని, బలవంతంగా ప్రాణాలు తీశారని తెలిసింది.. ఈ ముగ్గురుని చంపాల్సిన అవసరం ఎవరికుందా అని ఆరా తీస్తున్న పోలీసులకు భయంగా బిత్తరచూపులు చూస్తున్న వారి కజిన్‌ వినీత్‌ కనిపించాడు..

మూడు చావులకు అతడే కారణం అయివుండాడన్న గట్టి నమ్మకంతో తమదైన శైలిలో విచారించారు పోలీసులు.. నేరం ఒప్పుకున్నాడు.. ఎందుకు చంపాల్సి వచ్చిందో కూడా చెప్పుకున్నాడు. తన కజిన్‌ సుఖీయా, బంటి ప్రేమించుకుని పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న విషయం తెలిసి రగిలిపోయాడు వినీత్‌.. కుటుంబ పరువు, గౌరవం కోసం వారిని చంపేయాలనుకున్నాడు.. వెంటనే తన ముగ్గురు ఫ్రెండ్స్‌ను పిలిచి తన ప్లాన్‌ చెప్పాడు.. వారికి రెండున్నర లక్షల సుపారి కూడా ఇచ్చాడు.. అందరూ కలిసి ఆ ప్రేమజంటను చంపేసి .. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. ఇది ఎలాగోలా వినీత్‌ సోదరుడికి తెలిసింది. జరిగినదంతా పోలీసులకు చెబుతానంటూ బెదిరించాడు.. దీంతో బెదిరిపోయిన వినీత్‌ అతడిని కూడా చంపేసి అక్కడే చెట్టుకు ఉరివేశాడు..ఇప్పుడు వినీత్‌ , అతడి ముగ్గురు స్నేహితులు కటకటాలు లెక్కపెడుతున్నారు.

భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..