AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతానం కోసం ఇద్దరు మహిళల బలి.. మూఢనమ్మకాలను నమ్మి కటకటాల పాలైన దంపతులు.. విచారణలో నమ్మలేని నిజాలు

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్మేవారు పెరిగిపోతున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా...

సంతానం కోసం ఇద్దరు మహిళల బలి.. మూఢనమ్మకాలను నమ్మి కటకటాల పాలైన దంపతులు.. విచారణలో నమ్మలేని నిజాలు
Subhash Goud
|

Updated on: Oct 25, 2021 | 11:24 AM

Share

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్మేవారు పెరిగిపోతున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. మంత్రాల నెపంతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. మంత్రాలతో డబ్బులు వస్తాయని కొందరు.. ధనలాభం కలుగుతుందని మరి కొందరు.. క్షుద్ర పూజలతో పిల్లలు లేనివారికి పూజలు పుడతారని, లేక నరబలి ఇస్తే పిల్లలు కలుగుతారని మూఢనమ్మకాలను నమ్మి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. సంతానం లేని ఓ జంట భూతవైద్యున్ని ఆశ్రయించిన ఘటనలో ఇద్దరు మహిళలు బలయ్యారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టగా, ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి.

నరబలిస్తేనే సంతానం కలుగుతుందట.. గ్వాలియర్‌కు చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలుగలేదు. దీంతో మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ ఆ దంపతులను భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఓ వ్యక్తిని బలిస్తే సంతానం కలుగుతుందని ఆ మాంత్రికుడు చెప్పడంతో ఆ దంపతులు సరేనని ఒప్పుకొన్నారు. దీంతో బలిచ్చేందుకు వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారి మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ ఈనెల 13న ఓ సెక్స్‌ వర్కర్‌ను తీసుకువచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసి ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. మృతదేహంతో కొంతదూరం వెళ్లగా బైక్‌ జారి పడిపోయింది. దీంతో భయాందోళన చెందిన నీరజ్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన ఓ కుప్పలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

భూత వైద్యుని ఎదుట బలి.. అలాగే అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ను ట్రాప్‌చేసి ఆమెను కూడా హత్యచేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి భూతవైద్యుని ఎదుట బలిచ్చారు. అయితే మొదట హత్యకు గురైన మహిళ మృతదేహం ఈ అక్టోబర్‌ 21న లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మృతదేహం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు నీరజ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, సంచలన నిజాలను వెల్లడించాడు. నీరజ్‌ తెలిపిన వివరాలతో భూతవైద్యుడు సహా ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా మూఢనమ్మకాలను నమ్మి అమాయకులను బలి చేస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి వాటిని నమ్మి జీవితాలను నాశనం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Encounter: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురి మృతి!

Telangana: అప్పు తీర్చేందుకు.. రూ.2 వేలు సమకూరలేదని వ్యక్తి సూసైడ్