చెల్లి లవర్‌ను ట్రాప్ చేసిన అక్క.. కథలో అనుకోని ట్విస్ట్!
ఇంటర్నెట్ చదరంగంలో అక్కాచెల్లెళ్ల జీవితం ఎలా కంచెకు చేరిందో ఇప్పుడు చూద్దాం.. అందమైన కుటుంబం.. ఆపై సంతోషాలు నిండిన జీవితం ఆ ఇద్దరిది. అక్క ప్రణవి ఓ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్.. చెల్లి మహిమ డిగ్రీ చదువుతూ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక అనుకోని అతిథిలా అనిరుధ్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెల్లి మహిమను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ.. తనకోసం పడి చచ్చేవాడు. అయితే మహిమ మాత్రం అతడిని ఇష్టపడటం లేదు. ఇంతవరకు బాగానే ఉంది. […]
ఇంటర్నెట్ చదరంగంలో అక్కాచెల్లెళ్ల జీవితం ఎలా కంచెకు చేరిందో ఇప్పుడు చూద్దాం.. అందమైన కుటుంబం.. ఆపై సంతోషాలు నిండిన జీవితం ఆ ఇద్దరిది. అక్క ప్రణవి ఓ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్.. చెల్లి మహిమ డిగ్రీ చదువుతూ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక అనుకోని అతిథిలా అనిరుధ్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెల్లి మహిమను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ.. తనకోసం పడి చచ్చేవాడు. అయితే మహిమ మాత్రం అతడిని ఇష్టపడటం లేదు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే కథలో ట్విస్ట్ అన్నట్లుగా అన్నయ్య కోసం చేసిన అప్పు ఆ కుటుంబాన్ని వెంటాడింది.
అమెరికాలో సెటిల్ అయిన ఆ ఇద్దరి అన్నయ్య ఇంటికి డబ్బు పంపించడం మానేశాడు. అంతేకాకుండా తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం మానేశాడు. అటు అప్పులవాళ్లేమో.. వీళ్లకు ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న అక్క ప్రణవి తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులను కష్టాల నుంచి విముక్తి చేయాలని భావిస్తుంది. తన సాఫ్ట్‌వేర్ బుర్రకు పదును పెట్టి బ్రిలియంట్ స్కెచ్ వేస్తుంది.
ఇంటర్నెట్ ద్వారా లేని హోటల్‌ను క్రియేట్ చేసి.. దానిలో చెక్-ఇన్ అయితే ఆ డబ్బు వారి అకౌంట్‌లో పడేలా సాఫ్ట్‌వేర్ ఒకటి ప్రోగ్రాం చేస్తుంది. ఇక ఆమె అనుకున్న విధంగా అనిరుధ్ చేత ఆ హోటల్‌లో రూమ్ బుక్ చేస్తుంది. అటు అనిరుధ్ తనకు నచ్చిన అమ్మాయితో టైమ్ స్పెండ్ చేయబోతున్నానని సంతోషంతో వస్తాడు.. కానీ ఆ సంతోషం వెనుక ఓ దగా ఉందన్న సంగతి అతడికి తెలియదు. అక్కాచెల్లెళ్లు అనిరుధ్ కథను ముగించారా.. లేదా అనేది మీరే చూడండి..!