Swim death: తీవ్ర విషాదం.. ఆరుగురు మిత్రులు అప్పటివరకు సరదా గడిపారు.. అంతలోనే ముగ్గురు విగతజీవులుగా మారారు..!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Aug 02, 2021 | 9:06 AM

సరదాగా గడపాలనుకు స్నేహితులు అనంతలోకాలకు పయనమయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకలు విషాదాన్ని నింపాయి.

Swim death: తీవ్ర విషాదం.. ఆరుగురు మిత్రులు అప్పటివరకు సరదా గడిపారు.. అంతలోనే ముగ్గురు విగతజీవులుగా మారారు..!
Three Youths Swim Death In Srsp

Three Youths Swim death in SRSP: సరదాగా గడపాలనుకు స్నేహితులు అనంతలోకాలకు పయనమయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకలు విషాదాన్ని నింపాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిన్న ఈతకు వెళ్లి మృతి చెందారు ముగ్గురు యువకులు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యారు. కళ్ల ముందే తోటి స్నేహితులు నీటి మునగడంతో మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో బావి ఉండటంతో బావిలో ఈత కొట్టేందుకు ఆరుగురు స్నేహితులు దిగారు. దీంతో, నీటిలో మునిగిపోతున్నవారిని పశువుల కాపరులు గమనించి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో ముగ్గురు యువకులను మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. రెస్క్యూ టీమ్‌ సాయంతో ముగ్గురి డెడ్‌బాడీస్‌ను వెలికితీశారు. చనిపోయినవారిని ఉదయ్‌, రాహుల్‌, శివగా గుర్తించారు. కాగా, మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also… Youths Missing: ఆ సన్నిహితుల జీవితాలలో చెరగని చేదు జ్ఞాపకాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. అసలేం జరిగిందంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu