Warangal Murders: వరంగల్‌లో దారుణం.. కుటుంబంపై కత్తులతో తమ్ముడి దాడి.. ముగ్గురి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
Warangal Murders: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై కొందరు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్ల దాడి ముగ్గురిని హత్య చేశారు..
Warangal Murders: వరంగల్ లో దారుణం జరిగింది.. పశువులను నరికినట్లే ఓ కుటుంబాన్ని కత్తులతో నరికి ముగ్గురి ప్రాణాలు పొట్టనపెట్టుకున్నాడు ఓ కిరాతకుడు… ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.. హత్యకు పాల్పడిన వ్యక్తి మృతుడి సొంత తమ్ముడే విశేషం. దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై కొందరు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్ల దాడి ముగ్గురిని హత్య చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినవారు చాంద్ పాషా (50), కలీల్ (40), సబీరా (42) గా గుర్తించారు పోలీసులు. గాయపడిన వారు సమర్, ఫహద్‌లు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమా..?
కాగా, ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుటుంబాన్ని హతమార్చిన వ్యక్తి.. మృతుడు చాంద్ పాషా సొంత తమ్ముడు షఫీగా గుర్తించారు. పశువుల వ్యాపారంలో అన్నదమ్ములు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ హత్యలు జరిగిననట్లు తెలుస్తోంది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ సామూహిక హత్యలు బుధవారం తెల్లవారుజామున జరిగాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.. ఈ సామూహిక హత్యలో షఫీతో పాటు ఎంతమంది పాల్గొన్నారు..? వారంతా ఎవరూ..? అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు వరంగల్ ఏసీపీ గిరికుమార్ తెలిపారు.