Robbery: ఈ దునియాలో ఇలాంటి దొంగలు కూడా ఉంటారా?.. కాళ్లు మొక్కి, రూ. 500 ఇచ్చి మరీ..

Robbery: దొంగలంటే అందినకాడికి దోచుకుపోతారని తెలుసు. అవసరమైన ప్రాణాలు తీసిన దొంగలు కూడా ఉన్నారు. ఈ దొంగలు మాత్రం బహు విచిత్రం. ఇప్పటి వరకూ..

Robbery: ఈ దునియాలో ఇలాంటి దొంగలు కూడా ఉంటారా?.. కాళ్లు మొక్కి, రూ. 500 ఇచ్చి మరీ..
Thieve

Robbery: దొంగలంటే అందినకాడికి దోచుకుపోతారని తెలుసు. అవసరమైన ప్రాణాలు తీసిన దొంగలు కూడా ఉన్నారు. ఈ దొంగలు మాత్రం బహు విచిత్రం. ఇప్పటి వరకూ ఈ దునియాలనే చూడని దొంగలు వీరు. దొంగతనానికి వచ్చిన వారి ఎక్కడైనా ప్రాథేయ పడుతారా? బాధితుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతారా? మళ్లీ మీ డబ్బును మీకు తిరిగిచ్చేస్తామని అంటారా? కానీ ఈ దొంగలు ఇవన్నీ అంటారు.. చేస్తారు.. చేశారు కూడా. అవునండీ మీరు విన్నది నిజంగా నిజం. ‘‘ఈ రోజు మీ నుంచి తీసుకుంటున్న నగదు, నగలు సరిగ్గా ఆరు నెలల తర్వాత తిరిగి ఇచ్చేస్తాం. మేం చేసే తప్పుకు మమ్మల్ని క్షమించండి.’’ అంటూ సాయుధ దొంగలు చేతులు కట్టుకుని మరీ బాధితులకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన దేశ రాజధానికి సమీపంలో ఉన్న ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజిమాబాద్‌లో రాత్రి సమయంలో ఇద్దరు దొంగలు ఓ వృద్ధ దంపతుల ఇంట్లో చొరబడ్డారు. ఇళ్లంతా సోదా చేసి అందినకాడికి దోచుకున్నారు. ఆ తరువాత ఇంటి నుంచి పారిపోతూ.. బాధిత వృద్ధ దంపతుల పాదాలను తాకారు. ఆరు నెలల తర్వాత తాము దోచుకున్న డబ్బు, బంగారం మొత్తం తిరిగి ఇచ్చేస్తాం అని అన్నారు. అంతేకాదు.. ఆ దొంగతు బాధిత వృద్ధ దంపతులకు రూ. 500 లు చేతిలో పెట్టి, వారి కాళ్లకు నమస్కరించి, క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఐదు వందలు ఇవ్వడం వెనుక దొంగల ఉద్దేశం ఏంటో తెలియదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర వర్మ తన భార్య అరుణ వర్మతో కలిసి రాజ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఘజియాబాద్ మాజీ మేయర్ (మేయర్) కూడా తన ఇంటికి కొంత దూరంలోనే రాజ్ నగర్ సెక్టార్ -9 లో నివసిస్తున్నారు. వర్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారందరికీ వివాహాలు అయ్యాయి. కుమార్తెలు తమ తమ కుటుంబాలతో విదేశాలలో నివసిస్తున్నారు. సురేంద్ర వర్మ కొంతకాలం క్రితం వరకు ఘజియాబాద్‌లోని బులంద్‌షహర్ రోడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఫ్యాక్టరీని నడిపాడు. ప్రస్తుతం అది మూసివేశారు. అయితే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు అతని ఇంట్లోకి ప్రవేశించారు. ముసుగులు ధరించిన వీరి చేతిలో కత్తులు, తుపాకీ ఉన్నాయి. దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఇనుప తలుపును కట్ చేసి, ఆపై గాజు పగులగొట్టి సురేంద్ర వర్మ ఇంట్లోకి ప్రవేశించారు. అలా ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తమ వద్ద ఉన్న ఆయుధాలతో వృద్ధ దంపతులను బెదిరించారు. అలా ఇంట్లో ఉన్న ఒకటిన్నర లక్షల రూపాయల నగదు, సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ చేసే నగలు దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దోపిడీపై సమాచారం అందుకున్న కవినగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండటంతో ఆ వృద్ధ దంపతులు దొంగలను ప్రతిఘటించలేకపోయినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.

చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన దొంగలు..
ఆయుధాలతో ఇంట్లోకి వచ్చిన దుండగులు.. నగదు, వస్తువులను దోచుకున్న తరువాత బాధిత వృద్ధ దంపతుల పాదాలను తాకారు. వారికి ఐదువందల రూపాయలు ఇచ్చారు. అలాగే.. దంపతులు కలవరపడవద్దని చెప్పారు. తాము ఈ రోజు తీసుకుంటున్న నగదు, నగలు ఆరు నెలల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని బాధిత జంటకు తెలియజేశారు. ఇది మాత్రమే కాదు.. సాయుధ దొంగలు బాధిత జంట ముందు చేతులు కట్టుకుని నిల్చుని తమ అకృత్యాలకు క్షమాపణలు కూడా చెప్పారట. మరి ఈ దొంగలు నిజంగానే విచిత్రం కదా!

Also read:

Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..

Covid 19 Vaccine: వ్యాక్సినేషన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఒక్క రోజులో కోటీ 30 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ..

భర్త పుట్టినరోజుకు సర్ ప్రైస్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..:AP Deputy CM pPushpa Sreevani Photos.

Click on your DTH Provider to Add TV9 Telugu